ఫ్యామిలీతో కమల్ బర్త్‌డే సెలబ్రేషన్స్
తమిళనాడు రాష్ట్రం రామాంతపురం జిల్లాలోని తన స్వగ్రామం పరమకుడిలో కమల్ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్నారు..

తమిళనాడు రాష్ట్రం రామాంతపురం జిల్లాలోని తన స్వగ్రామం పరమకుడిలో కమల్ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్నారు..
విశ్వనాయకుడు కమల్ హాసన్ తన 65వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. నవంబర్ 7 కమల్ పుట్టినరోజే కాదు.. ఈ ఏడాదితో నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కమల్ 5 ఏళ్ల వయసులోనే బాలనటుడిగా తెరంగేట్రం చేసిని సంగతి తెలిసిందే..
తమిళనాడు రాష్ట్రం రామాంతపురం జిల్లాలోని తన స్వగ్రామం పరమకుడిలో కమల్ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్నారు.. నవంబర్ 7న కమల్ తండ్రి శ్రీనివాసన్ వర్ధంతి కూడా కావడంతో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.. కమల్ సోదరుడు చారు హాసన్ కుటుంబం, సుహాసిని మణిరత్నం, కమల్ కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్, నటి పూజా కుమార్ తదితరులు కమల్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు.
Read Also : రవితేజ 66లో సముద్రఖని
నవంబర్ 8న కమల్ తన గురువు బాల చందర్ విగ్రహాన్ని తన ఆఫీసులో ఆవిష్కరించనున్నారు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) లో నటిస్తున్నారు కమల్ హాసన్..
#NammavarInParamakudi pic.twitter.com/1HOIdi5Lbz
— Ramesh Bala (@rameshlaus) November 7, 2019