Kamal Haasan : ఇండియన్ 2తో పాటు ఇండియన్ 3 కూడా షూట్ అయిపోయిందా.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్..

తాజాగా కమల్ హాసన్ ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ తో పాటు తన సినిమాల గురించి కూడా మాట్లాడారు.

Kamal Haasan : ఇండియన్ 2తో పాటు ఇండియన్ 3 కూడా షూట్ అయిపోయిందా.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్..

Kamal Haasan Comments on His Movies and Gives Clarity on Indian 3

Updated On : March 25, 2024 / 8:37 AM IST

Kamal Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో శంకర్ దర్శకత్వంలో చేసిన ఇండియన్(భారతీయుడు) సినిమా భారీ హిట్ అవ్వగా దానికి సీక్వెల్ ఇండియన్ 2 తీస్తున్నామని ప్రకటించారు. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఇండియన్ 3 సినిమా కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి.

తాజాగా కమల్ హాసన్ ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ తో పాటు తన సినిమాల గురించి కూడా మాట్లాడారు. కమల్ హాసన్ తన సినిమాల గురించి మాట్లాడుతూ.. ఆల్రెడీ ఇండియన్ 2(Indian 2) సినిమాతో పాటు ఇండియన్ 3 షూటింగ్ కూడా అయిపొయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇండియన్ 2 సినిమా ఎలక్షన్స్ అయ్యాక రిలీజ్ అవుతుంది. ‘థగ్ లైఫ్’ సినిమా షూట్ కూడా ఎన్నికలు అయ్యాక మొదలవుతుంది. కల్కి 2898AD సినిమాలో ఓ గెస్ట్ పాత్ర చేశాను అని తెలిపారు.

Also Read : NTR : ఎన్టీఆర్ డూప్ లేకుండా ఆ సినిమాలో యాక్షన్ సీన్స్ చేస్తున్నారా?

దీంతో ఇండియన్ సీక్వెల్స్ పై క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ 2తో పాటు ఇండియన్ 3 కూడా ఉందని కమల్ హాసన్ చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ 2 ఆగస్టులో రిలీజ్ అవుతుందని సమాచారం. ఇండియన్ 3 మాత్రం వచ్చే సంవత్సరమే ఉంటుందని తెలుస్తుంది.