ఎన్నో అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు 2 సినిమా ఎలా ఉంది? ట్విటర్ రివ్యూ

కమల హాసన్ నటన అద్భుతం.. శంకర్ తన మార్క్ డైరెక్షన్ మిస్సయ్యారు.. సిద్ధార్థ్, రకుల్ బాగా చేశారు..

indian 2

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు 2 సినిమాపై ఎక్స్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు దీనిపై సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమల హాసన్, శంకర్ కాంబినేషన్‌ అంటే మొదట గుర్తుకు వచ్చేది 1996లో విడుదలైన భారతీయుడు సినిమా.

అప్పట్లో ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. భారత సమాజానికి అంటుకున్న లంచం అనే మరకను రక్తంతో కడిగేసే పాత్రలో కమల హాసన్ నటించాడు. సామాజిక స్పృహతో, ఉన్నత విలువలతో శంకర్ తీసిన ఆ సినిమా అందరినీ ఆలోచింపజేసింది. బిగ్ హిట్‌గానూ నిలిచింది.

దీంతో అదే కమల్, శంకర్ కాంబినేషన్‌లో ఇప్పుడు విడుదలైన భారతీయుడు 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సేనాపతి (కమల్) మరోసారి మనుషుల్లోని చెత్తను కడిగేసే ప్రయత్నం చేశాడు. దాదాపు 28 ఏళ్ల తర్వాత వచ్చిన భారతీయుడు సీక్వెల్‌లోనూ మళ్లీ తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శంకర్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఉందని నెటిజన్లు అంటున్నారు.

పాత స్టోరీతోనే..
విజువల్ వండర్ బాగా పనిచేసిందని చెబుతున్నారు. అనిరుధ్ ఆర్ఆర్ అదుర్స్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దర్శకుడు శంకర్ మాత్రం పాత స్టోరీతోనే కాస్త ప్రేక్షకులను విసిగించాడని నెటిజన్లు చెబుతున్నారు. ఎక్స్ లో ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఇంకా ఏమనుకుంటున్నారో చూద్దాం.

ఇంటర్వెల్.. క్లైమాక్స్ స్టంట్స్ బాగున్నాయ్..
కమల హాసన్ నటన అద్భుతం.. శంకర్ తన మార్క్ డైరెక్షన్ మిస్సయ్యారు.. సిద్ధార్థ్, రకుల్ బాగా చేశారు.. అనిరుధ్ సంగీతం అద్భుతం.. స్క్రీన్‌ప్లే కాస్త స్లోగా ఉంది.. ఇంటర్వెల్.. క్లైమాక్స్ స్టంట్స్ బాగా పనిచేశాయి.. అని కొందరు ప్రేక్షకులు రాసుకొచ్చారు.