Kamal Haasan: విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో కమల్.. మళ్ళీ పాత పంథాలోకి లోకనాయకుడు?

సౌత్ సీనియర్ హీరోలలో ఒకడైన కమల్ హాసన్ పంథా వేరుగా ఉంటుంది. తోటి హీరోలంతా.. తన వయసు తగ్గ కథలు.. శరీరం సహకరించే కష్టంలేని కథలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటే కమల్ మాత్రం టెక్నాలజీని..

Kamal Haasan: విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో కమల్.. మళ్ళీ పాత పంథాలోకి లోకనాయకుడు?

Kamal Haasan

Updated On : March 26, 2022 / 6:08 PM IST

Kamal Haasan: సౌత్ సీనియర్ హీరోలలో ఒకడైన కమల్ హాసన్ పంథా వేరుగా ఉంటుంది. తోటి హీరోలంతా.. తన వయసు తగ్గ కథలు.. శరీరం సహకరించే కష్టంలేని కథలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటే కమల్ మాత్రం టెక్నాలజీని వాడుకుంటూ ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు కూడా అందని కథలతో సినిమాలు చేస్తుంటాడు. అలాగే ఇప్పుడు భారతీయుడు 2, విక్రమ్ సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. అయితే.. ఈ సినిమాలు ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు ఉండడంతో తొలి నుండి కమల్ ఫ్యాన్స్ బేస్ గా ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ కొందరు దూరమవుతున్నారు.

Kamal Haasan : లోకనాయకుడు వచ్చేస్తున్నాడు.. ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

దృశ్యం రీమేక్ సినిమాతో ఆ మధ్య కొంత ఈ గ్యాప్ భర్తీ చేసిన అది రీమేక్ సినిమా కావడంతో కమల్ మార్క్ ఫ్యామిలీ సినిమా కోసం ఓ వర్గం ఎదురుచూస్తుంది. అందుకే, కమల్ ఈసారి పంథా మార్చి మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఒక చేస్తున్నాడట. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.`కొంబన్’, `మరుదు` వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

Kamal Haasan : ముగ్గురు స్టార్ హీరోల మల్టీస్టారర్.. 150 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్..

ఈ మధ్యనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `విక్రమ్` షూటింగ్ పూర్తయింది. శంకర్ దర్శకత్వం మళ్ళీ రీస్టార్ కావాల్సిన ఇండియన్ 2 సినిమా మొదలయ్యేందుకు సమయం పట్టే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకవేళ ఇండియన్ 2 మొదలైనా భారీ సినిమా కావడంతో కమల్ కి కాస్త రిలీఫ్ డేట్స్ దొరికే ఛాన్స్ ఉంది. అందుకే ఈ గ్యాప్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ముత్తయ్య దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. మరి ఈ సినిమా కథ ఏంటో.. ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.