సినిమా సెలబ్రిటీల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల వరకు ప్రముఖుల గొంతులను మిమిక్రి చేయడం చూస్తూనే ఉంటాం. అయితే కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో 51మంది వాయిస్‌లను మిమిక్రీ చేయగల అసాధారణ నైపుణ్యం మాత్రం ఆమె సొంతం. ఆ అద్భుతం పేరే అఖిల.
కేరళలోని తిరువనంతపురం జిల్లా నేదుమంగాడ్‌కు చెందిన అఖిలా అనే యువతి ఎ.ఎస్ ఆయుర్వేద మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె ప్రతి నాలుగు సెకన్లకు ఓ గొంతు మార్చి మగ నుండి ఆడ వరకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు.. మిమిక్రీ చేసి మిరాకిల్స్ చేశారు. ఆమె మిమిక్రీ కళకు ఇంటర్నెట్ మొత్తం ఇంప్రెస్ అయ్యింది.
స్కూల్ చదివే రోజుల నుంచే మిమిక్రీపై ఇంట్రస్ట్ పెంచుకున్న అఖిల.. వివిధ రకాల జంతువుల వాయిస్‌లను ఇమిటేట్ చేయడం ప్రారంభించింది. అలా స్కూల్ దశలోనే పలు అవార్డులను సొంతం చేసుకున్న ఆమె.. తర్వాత కూడా పలు టీవీ షోల ద్వారా సత్తా చాటుతుంది. షారుక్ ఖాన్, కమల్, రజనీ, ఎస్ జానకీ లాంటి ఎంతోమంది గాత్రాలు ఆమె గొంతు నుంచి వినొచ్చు.
అంతేకాదు మైఖేల్ జాక్సన్ పాటల్లోని బీట్ శబ్దాలు కూడా ప్రత్యేకంగా ఆమె పలికిస్తుంది. పూక్కలం వరవాయ్ చిత్రంలో బేబీ షాలినికి కూడా ఆమె డబ్బింగ్ చెప్పారట. అంతేకాదు ధూమపాన వ్యతిరేక ప్రకటనల ద్వారా థియేటర్లలో వినిపించే గోపన్ నాయర్ వాయిస్‌ను అఖిల తన గొంతు ద్వారా వినిపిస్తుంది.
Really talented Akhila does a few voice impressions for @thenewsminute pic.twitter.com/KvAp0bi3UR
— Cris (@cristweets) January 1, 2020