Kamal Haasan : చాలా గర్వంగా ఉంది సోదరా.. పవన్ విజయంపై లోకనాయకుడు కామెంట్!

Kamal Haasan : తాజాగా లోకనాయకుడు, భారత లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూడా ఎన్నికల్లో పవన్ సాధించిన విజయంపై ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

Kamal Haasan Special Message to Pawan Kalyan ( Image Credit : Google )

Kamal Haasan : ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అద్భుతం విజయం అందుకున్న జనసేనాని పవన్ కల్యాణ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎన్నికల్లో పోటీచేసిన 21 స్థానాల్లో గెలిచి అఖండ విజయాన్ని అందుకున్నారు. రాజకీయ ప్రముఖలతో పాటు సినీప్రముఖులు సైతం పవన్ విజయాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అందరి నుంచి పవన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా లోకనాయకుడు, భారత లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూడా ఎన్నికల్లో పవన్ సాధించిన విజయంపై ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమల్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘ఎన్నికల్లో విజయంపై పవన్‌తో జరిగిన సంభాషణ చాలా ఉద్వేగభరితమైనది.

పవన్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు సేవ చేసే ఈ యాత్రను ప్రారంభించినందుకు నేను ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది సోదరా’’ అంటూ కమల్ ట్వీట్ చేశారు.

తమిళనాడులో ‘మక్కల్‌ నీది మయ్యం’ పేరుతో కమల్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కమల్ ఓటమిపాలయ్యారు. అనంతరం డీఎంకేకు ఆయన మద్దతిచ్చారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన రెండు మూవీలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి భారతీయుడు మూవీ, కల్కి 2898ఏడి సినిమాలు. అతి త్వరలో ఈ మూవీలు విడుదల కానున్నాయి.

Read Also : Jyothi Poorvaj : గుప్పెడంత మనసు జగతి మేడం.. సినిమా ఈవెంట్లో మెరిసిపోతున్న జ్యోతి రాయ్..