Kamal Hasaan : హాలీవుడ్లో లోకనాయకుడు.. కామిక్ కాన్కి చేరుకున్న కమల్ హాసన్.. పిక్స్ వైరల్!
హాలీవుడ్లో లోకనాయకుడు కమల్ హాసన్. కామిక్ కాన్కి చేరుకున్న కమల్ ని చూసేందుకు వచ్చిన అభిమానులు.
- gum 95921
- Updated on- July 20, 2023 / 02:51 PM IST
Kamal Hasaan at Comic Con 2023 for Project K title glimpse release
Kamal Hasaan : లోకనాయకుడు కమల్ హాసన్.. ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ని అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొడానికి మూవీ దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్ అండ్ కమల్ హాసన్ కూడా అక్కడికి చేరుకున్నారు. తాజాగా వీరిద్దరూ కామిక్ కాన్ ఈవెంట్ కి చేరుకున్నారు.
కమల్ హాసన్ ని చూసేందుకు అక్కడి ఇండియన్ ఆడియన్స్ ఆ ఈవెంట్ కి చేరుకోగా.. వారితో కమల్ కొంతసేపు ముచ్చటించి వారికీ ఫోటోలు ఇచ్చి వారిని ఆనందపరిచాడు. అలాగే కామిక్ కాన్ లో ప్రభాస్, కమల్, రానా దగ్గుబాటి కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, హాలీవుడ్ ఈవెంట్ లో మన ప్రాజెక్ట్ K హంగామా మాములుగా లేదు. ప్రాజెక్ట్ K లోని రైడర్స్ చిత్ర యూనిట్ ఇప్పటికే మనందరికీ పరిచయం చేసింది. ఇప్పుడు వారితోనే అక్కడ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.
రైడర్స్ సూట్ వేసుకున్న వ్యక్తులు కామిక్ కాన్ ఈవెంట్ లో తెగ సందడి చేస్తున్నారు. ఇక గ్లింప్స్ రేపు తెల్లవారుజామున రిలీజ్ చేయనున్నారు. సరైన సమయం చిత్ర యూనిట్ ఇంకా తెలియజేయలేదు. నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి అసహనం వ్యక్తం అవ్వడంతో.. అదే ఫోటోని కొంచెం మార్చి మళ్ళీ నేడు కొత్తది రిలీజ్ చేశారు. నిన్న రిలీజ్ చేసిన పిక్ ని తన అకౌంట్ నుంచి పూర్తిగా తొలిగించింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు.
Kamal Hasaan at Comic Con 2023 for Project K title glimpse release
Kamal Hasaan at Comic Con 2023 for Project K title glimpse release
Kamal Hasaan at Comic Con 2023 for Project K title glimpse release
