Kamal Hasan Health Bulletin release
Kamal Hasan : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ ఫార్మ్‌లో ఉన్నాడు. ఒకపక్క వరుస సినిమాలకు ఓకే చెబుతూ దూసుకుపోతున్నాడు. మరోపక్క తమిళ బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ, ఈ వయసులో కూడా తీరిక లేకుండా పని చేస్తున్నాడు. ఇక నిన్న ఉదయం హైదరాబాద్ వచ్చిన కమల్.. తన గురువు కళాతపస్వి విశ్వనాథ్ ని కలిశాడు.
Kamal Haasan : కమల్ హాసన్‌కు అస్వస్థత.. చెన్నై హాస్పిటల్‌లో చేరిక..
విశ్వనాథ్ యోగక్షేమాలు తెలుసుకున్న కమల్, అయన ఆశీర్వాదం తీసుకోని అక్కడి నుండి మళ్ళీ చెన్నైకి తిరిగి పయనమయ్యాడు. అయితే ప్రయాణ సమయంలో కొంత అస్వస్థతకి గురికావడంతో, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంగారు పడ్డారు. తాజాగా కమల్ హాసన్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది వైద్య బృందం.
అస్వస్థతతో చెన్నై శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో అడ్మిట్ అయిన కమల్.. స్వల్ప జరం, దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నట్లు నివేదికలో వెల్లడించారు. ‘అయన త్వరగానే కోలుకుంటున్నారు, ఈరోజు లేదా రేపు డిశ్చార్జ్ అవుతారు’ అంటూ వైద్యులు చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కమల్ క్షేమంగా ఇంటికి రావాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.