Kamal Haasan : లోకనాయకుడు వచ్చేస్తున్నాడు.. ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న 'విక్రమ్' సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా విడుదల తేదీని ఇవాళ ఉదయం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది..

Vikram

 

Vikram :  లోక నాయకుడు కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహిద్ ఫాజిల్ కలిసి ‘విక్రమ్’ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఖైదీ, మాస్టర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన యువ ట్యాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ‘విక్రమ్’ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. గతంలో రిలీజ్ అయిన ‘విక్రమ్’ సినిమా గ్లింప్స్ కి భారీ స్పందన లభించింది. ఈ ముగ్గురు స్టార్ హీరోల అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 

బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘విక్రమ్’ సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా విడుదల తేదీని ఇవాళ ఉదయం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వేసవిలో మే చివర వరకు పాన్ ఇండియా సినిమాలన్నీ డేట్స్ లాక్ చేసి ఉంచడంతో విక్రమ్ సినిమాని జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కమల్ హాసన్ కూడా తన ట్విట్టర్ లో ‘విక్రమ్’ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

Kamal Haasan : ముగ్గురు స్టార్ హీరోల మల్టీస్టారర్.. 150 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్..

విడుదల తేదీతోపాటు ‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు ఆనందిస్తున్నారు. విక్రమ్ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన మేకింగ్ సీన్స్ ని గ్లింప్స్‌ రూపంలో ఇందులో చూపించారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలుస్తుంది. ముగ్గురు హీరోల అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా జరిగినట్లు సమాచారం.