Bharatheeyudu 2 : రామ్‌చరణ్ తర్వాతే కమల్‌హాసన్ అంటున్న శంకర్..

విక్రమ్ ఇచ్చిన జోష్ తో మరింత క్లారిటీగా తన నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేయనున్నారు కమల్. గతంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమా భారీ విజయం............

Bharatheeyudu 2

Kamal Haasan :  లోక నాయకుడు కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో వచ్చి భారీ హిట్ సాధించారు. చాలా రోజుల తర్వాత కమల్ కి బిగ్గెస్ట్ హిట్ రావడంతో కమల్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసి ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించిన కమల్ కి డబ్బులు కూడా బాగా తెచ్చి పెట్టింది. దీంతో కమల్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ కి గిఫ్ట్స్, పార్టీలు ఇచ్చారు కమల్.

విక్రమ్ ఇచ్చిన జోష్ తో మరింత క్లారిటీగా తన నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేయనున్నారు కమల్. గతంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 ప్రకటించి ఇప్పటికే కొంత షూటింగ్ కూడా చేశారు. అయితే కమల్, శంకర్, నిర్మాతల మధ్య వచ్చిన కొన్ని ఇష్యూస్ వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పటికి ఈ సినిమా విషయంలో వివాదం నడుస్తుంది.

Coffee Day : కాఫీ డే సృష్టికర్త వీజీ సిద్ధార్థ బయోపిక్..

దీంతో శంకర్ ఈ సినిమా వదిలిపెట్టి వేరే సినిమాలు చేయడానికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో కూడా ఒక సినిమా ప్రకటించాడు. తాజాగా విక్రమ్ సక్సెస్ తో భారతీయుడు 2ని మళ్ళీ మొదలు పెట్టాలని కమల్ భావించారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు శంకర్ తో కూడా కమల్ మాట్లాడారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తో శంకర్ సినిమా చేస్తుండటంతో అది అయ్యాక భారతీయుడు 2 కచ్చితంగా చేస్తాను అని శంకర్ కమల్ తో అన్నారు. ఈ విషయాన్ని కమల్ మీడియాకి తెలిపారు.

ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ లో కమల్ భారతీయుడు 2 గురించి మాట్లాడుతూ.. ”భారతీయుడు 2 సినిమా కచ్చితంగా శంకర్ డైరెక్షన్ లోనే రీస్టార్ట్ అవుతుంది. నా ఫ్యాన్స్ కన్నా నేనే ఎక్కువగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది కంప్లీట్ చేసేశాక మాదే మొదలవుతుంది” అని తెలిపారు. దీంతో కమల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి శంకర్ వచ్చే వరకు కమల్ ఆగుతారా లేదా ఈ లోపు వేరే ఏదైనా సినిమా కమిట్ అవుతారా చూడాలి.