Coffee Day : కాఫీ డే సృష్టికర్త వీజీ సిద్ధార్థ బయోపిక్..

మనం సరదాగా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకోవాలన్నా, చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకోవాలన్నా అందరికి అడ్డాగా మారింది కాఫీ డే. దాన్ని అంతలా పైకి తీసుకెళ్లారు కాఫీ డే సృష్టికర్త వీజీ సిద్ధార్థ..............

Coffee Day : కాఫీ డే సృష్టికర్త వీజీ సిద్ధార్థ బయోపిక్..

Vg Siddarth Coffee Day

VG Siddarth :  మనం సరదాగా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకోవాలన్నా, చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకోవాలన్నా అందరికి అడ్డాగా మారింది కాఫీ డే. దాన్ని అంతలా పైకి తీసుకెళ్లారు కాఫీ డే సృష్టికర్త వీజీ సిద్ధార్థ. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి కాఫీ పంటని సాగు చేస్తూ కాఫీ డేని స్థాపించి దేశ విదేశాల్లో కాఫీ డేని సక్సెస్ చేశారు. అయితే ఒక సమయంలో అప్పుల్లో కూరుకుపోవడంతో ఆయన అనూహ్యంగా మరణించారు. ఇప్పటికి కూడా అది హత్యో, ఆత్మహత్య ఎవరికీ తెలీదు. ఎంతో కష్టపడి సక్సెస్ అయిన ఆయన అలా మరణించడం చాలా బాధాకరం. ఆయన కాఫీ డేని పెంపొందించిన తీరు, ఆయన ఎదిగిన తీరు ఎంతోమందికి ప్రేరణ.

తాజాగా ‘కెఫె కాఫీ డే’ సృష్టికర్త వీజీ సిద్ధార్థ జీవితాన్ని సినిమాగా చూపించనున్నారు. ఇప్పటికే ఆయన జీవితంపై ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టులు రుక్మిణీ బీఆర్‌, ప్రొసెంజీత్ దత్తా ‘కాఫీ కింగ్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కనుంది. బయోపిక్ లకు అడ్డాగా మారిన బాలీవుడ్ లోనే ఇది కూడా తెరకెక్కనుంది. ఈ పుస్తకం హక్కులను టీ-సిరీస్‌, ఆల్‌మైటీ మోషన్‌ పిక్చర్‌ సంస్థలు కొనుగోలు చేశాయి.

Vaishnav Tej : త్రివిక్రమ్‌తో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ సినిమా..

కాఫీ డే సామ్రాజ్యంతో, కాఫీని ప్రజల జీవితంలో భాగం చేసి, ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీజీ సిద్ధార్థ 59 ఏళ్ల వయసులో అనూహ్యంగా మరణించడం, ఆయన మృతదేహం కర్ణాటకలోని ఓ నదిలో దొరకడం లాంటి ఆయన జీవితంలోని పలు ముఖ్య విషయాలని వెండితెరపై చూపనున్నట్టు టీ- సిరీస్‌ ఛైర్మన్‌ భూషణ్‌ కుమార్‌ తెలిపారు. అయితే సిద్ధార్థ పాత్రను ఎవరు పోషిస్తారో ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలని తెలియచేయనున్నారు.