హైదరాబాద్ చాలా అందంగా ఉంది.. కొందరు భక్తిని అపహాస్యం చేస్తున్నారు.. కంగన సెన్సేషనల్ కామెంట్స్..

  • Published By: sekhar ,Published On : October 12, 2020 / 01:04 PM IST
హైదరాబాద్ చాలా అందంగా ఉంది.. కొందరు భక్తిని అపహాస్యం చేస్తున్నారు.. కంగన సెన్సేషనల్ కామెంట్స్..

Updated On : October 12, 2020 / 4:37 PM IST

Kangana Ranaut : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ #Thalaivi లో బాలీవుడ్ బ్యూటీ Kangana Ranaut ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో వేసిన అసెంబ్లీ సెట్‌లో ‘తలైవి’ చిత్రానికి సంబంధించిన
కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. యూనిట్‌ తర్వాతి షెడ్యూల్‌కు సన్నద్ధమవుతుండగా కంగనకు కాస్త గ్యాప్ దొరికడంతో ఆమె సోషల్‌ మీడియా ద్వారా తన అనుభూతిని షేర్ చేసుకుంటున్నారు.


తాజాగా తాను హైదరాబాద్‌ అందానికి ముగ్దురాలినయ్యానంటూ ఓ పోస్ట్ చేశారామె. ‘‘హైదరాబాద్‌ చాలా అందంగా ఉంది. ఎంతో ఆహ్లాదకరంగా హిమాలయాలను తలపిస్తోంది. సూర్యోదయ సమయంలో ఈ అందం మరింత పెరుగుతోంది. చిన్నపాటి చలి, దానితోపాటు ఉండే వెచ్చదనం మనల్ని ఓ రకమైన మత్తులోకి తీసుకెళుతుంది..’’ అంటూ ఓ వీడియో షేర్‌ చేశారు.
Thalaivi

Salma Hayek వ్యాఖ్యలపై..
హాలీవుడ్‌ నటి Salma Hayek ఈమధ్య తాను లక్ష్మీదేవిని పూజిస్తానంటూ ట్వీట్‌ చేసిన నేపథ్యంలో ఈ విషయం గురించి కంగనా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ భక్తి అనే అంశంపై సెన్సేషనల్ కామెంట్స్‌ను చేశారు.

‘‘నేను ఊహించని విధంగా ప్రపంచంలో శివుడు, కృష్ణుడు, లేదా దేవీ భక్తులను కనిపెట్టాను. మతం లేదా జాతి గురించి చాలా మంది రాముడిని ప్రేమిస్తారు లేదా భగవద్గీతను అనుసరిస్తారు. కానీ భారతదేశంలో కొన్ని దురదృష్టకర ఆత్మలు భక్తిని అపహాస్యం చేస్తున్నారు. ఇక్కడ నేను ప్రస్తావించాలనుకున్న విషయం ఒకటే. మనం భక్తిని ఎంచుకోవడం లేదు. భక్తే మనల్ని ఎంచుకుంటోంది..’’ అన్నారు. ఎప్పుడూ ఏదో వివాదంతో వార్తల్లో నిలిచే ఫైర్ బ్రాండ్ కంగన ఇప్పుడు భక్తి, భక్తులపై చేసిన ఈ కామెంట్స్ ఎన్ని వివాదాలకు తెరతీస్తుందో చూడాలి..