Kangana Ranaut
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఖలిస్తానీ ఉగ్రవాదులపై తాను చేసిన వ్యాఖ్యలకు స్పందనగా తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఈ విషయంలో చర్యలు తీసుకునేలా పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరింది. తనపై బెదిరింపులకు ద్వేషపూరిత రాజకీయాలు చేసేవారు పూర్తి బాధ్యత వహిస్తారని కంగనా పేర్కొంది. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో తన ఫోటోతో పాటు హిందీలో ఒక నోట్‌ను రాసింది.
Kangana Ranaut: సిక్కులను కించపరిచే కామెంట్లు చేసిందని కంగనాపై ఎఫ్ఐఆర్
ఖలిస్తానీ ఉగ్రవాదులపై తాను చేసిన వ్యాఖ్యలపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినట్లుగా కంగనా వెల్లడించింది. కంగనా తన సోదరి రంగోలి చందేల్, తల్లి ఆశా రనౌత్‌తో కలసి గోల్డెన్ టెంపుల్‌లో ప్రార్థనలు చేస్తున్నప్పుడు తలపై దుపట్టాతో నీలిరంగు సల్వార్ సూట్ ధరించి ఉన్నట్లు ఫోటోలో చూపించింది. ఇక, తన వివాదాస్పద వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ, కంగనా హిందీలో ఇలా రాసింది, ‘ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వారిని స్మరించుకుంటూ, దేశద్రోహులను ఎప్పటికీ క్షమించకూడదని, మరచిపోకూడదని నేను రాశాను.
Kangana..farm laws : వ్యవసాయ చట్టాల రద్దుపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ తరహా ఘటనల్లో దేశ అంతర్గత ద్రోహుల హస్తం ఉంది. డబ్బు కోసం, పదవి, అధికారం కోసం భారత మాతను కించపరిచే ఒక్క అవకాశాన్ని కూడా దేశద్రోహులు వదిలిపెట్టలేదు. దేశంలోని దేశద్రోహులు కుట్రలు చేయడం ద్వారా దేశ వ్యతిరేక శక్తులకు సహాయం చేస్తూనే ఉన్నారు, ఇది ఇటువంటి సంఘటనలకు దారితీసింది. తన వ్యాఖ్యల వల్ల తనకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపిన కంగనా.. ‘నా ఈ పోస్ట్‌పై విధ్వంసక శక్తుల నుండి నాకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని.. బటిండాకు చెందిన ఒక వ్యక్తి నన్ను చంపేస్తానని బహిరంగంగా బెదిరించాడని పేర్కొంది.
Kangana Ranaut : స్టార్ కమెడియన్ ని టెర్రరిస్ట్ తో పోల్చిన కంగనా
అయితే, ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసే వారికి వ్యతిరేకంగా ఎల్లప్పుడూ మాట్లాతూనే ఉంటానని ధీమా చెప్పుకొచ్చింది. కంగనా తన వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ‘ప్రజాస్వామ్యమే మన దేశానికి అతిపెద్ద బలం. ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు కానీ పౌరుల సమగ్రత, ఐక్యత, ప్రాథమిక హక్కులను పరిరక్షించే ప్రాథమిక హక్కు, ఆలోచనల వ్యక్తీకరణ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు అందించబడింది. నేను ఏ కులం, మతం గురించి కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడలేదని పేర్కొంది.
Kangana Ranaut : నా ప్రశ్నలకు సమాధానమిస్తే.. ‘పద్మ శ్రీ’ తిరిగి ఇచ్చేస్తా: కంగనా రనౌత్
పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తనపై వచ్చిన బెదిరింపులను పరిశీలించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని అభ్యర్థించిన కంగనా.. ‘మీరు కూడా ఒక మహిళ, మీ అత్తగారు ఇందిరా గాంధీ జీ చివరి క్షణం వరకు ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలంగా పోరాడారు. అటువంటి తీవ్రవాద, విధ్వంసక, దేశ వ్యతిరేక శక్తుల నుండి బెదిరింపుల గురించి వెంటనే చర్య తీసుకోవాలని దయచేసి పంజాబ్ ముఖ్యమంత్రిని ఆదేశించండి’ అని రాసుకొచ్చింది.