Kangana..farm laws : వ్యవసాయ చట్టాల రద్దుపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

వ్యవసాయ చట్టాల రద్దుపై నటి, బీజేపీ మహిళా నేత కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Kangana..farm laws : వ్యవసాయ చట్టాల రద్దుపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

Kangana Ranaut..farm Laws

Withdrawal of farm laws  shameful and absolutely unfair : వివాదాస్పదంగా మారి దాదాపు ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దుల్లో వేలాదిమంది రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్స్ చేశారు. రైతుల ఆందోళనలను లైట్ తీసుకున్న కేంద్రం అనూహ్యంగా గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ జాతిని ఉద్ధేశించి ప్రసంగిస్తు ‘వ్యవసాయ చట్టాలను రద్దు’చేస్తున్నామని ప్రకటించారు. దీంతో రైతులతో ఎంతోమంది సంతోషం వ్యక్తంచేశారు. ఈ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నటి కంగనా రనౌత్ మాత్రం ‘వ్యవసాయ చట్టాల రద్దు’ అంటూ ప్రధాని ప్రకటనపై మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

Read more : 3 Farm Laws : 3 వ్యవసాయ చట్టాల్లో ఉన్నవిషయాలేంటి..?రద్దు చేయాలని రైతులు ఆందోళన ఎందుకు?కేంద్రం దిగివచ్చిన కారణాలేంటి?

దీంతో ఎప్పట్లానే కంగనాపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మూడు వ్యవసాయం చట్టాలు రద్దు చేస్తామని ప్రధాని మోడీ నిర్ణయంపై కంగనా రనౌత్ స్పందిస్తు..‘ఇది పూర్తిగా విచారకరమైనది. అన్యాయమైనది అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై నెటిజనులు మండిపడుతున్నారు.

Read more : Farm Laws Repeal : కేంద్రం సంచలన నిర్ణయం.. వ్యవసాయ చట్టాలు రద్దు: ప్రధాని మోదీ

పోరాటాల శక్తి నిరూపించిన ఫలితమిది అంటూ నెటిజన్‌ పోస్ట్‌ను షేర్‌ చేసిన కంగనా ఇది చాలా విచారకరం​, అవమానం. పూర్తిగా అన్యాయం అని వ్యాఖ్యానించింది. అంతేకాదు పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధి పోరాటం చేస్తున్న వ్యక్తులు చట్టాలు చేయడం ప్రారంభిస్తే..ఇది కూడా జిహాదీ దేశమే. ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు అంటూ వ్యాఖ్యానించటంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more : New Farm Laws : వ్యవసాయ చట్టాలు రద్దు…ఇది రైతు విజయం

ప్రధాని సాగు చట్టాలను రద్దు చేసిన ప్రసంగంలో..రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర (MSP) యంత్రాంగాన్ని మరింత పారదర్శకంగా..ప్రభావవంతంగా చేయడానికి రాష్ట్ర, కేంద్ర ప్రతినిధుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రకటించారు. ఆందోళనను ఇక రైతులు విడిచిపెట్టి వారి గ్రామాలకు తిరిగి వెళ్లి సురక్షితంగా ఇళ్లకు వెళ్లాలని కోరారు. రైతుల కష్టాలు అర్థం చేసుకున్నామని ప్రధాన మంత్రి అన్నారు.కాగా..వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తు..పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఏడాది కాలంగా వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేసిన సంగతి తెలిసిందే.

Read more : Three Farm Laws: రైతు చట్టాల రద్దు.. తేదీల వారీగా వివరాలు