3 Farm Laws : 3 వ్యవసాయ చట్టాల్లో ఉన్నవిషయాలేంటి..?రద్దు చేయాలని రైతులు ఆందోళన ఎందుకు?కేంద్రం దిగివచ్చిన కారణాలేంటి?

3 వ్యవసాయ చట్టాల్లో ఉన్నవిషయాలేంటి..?రద్దు చేయాలని రైతులు ఆందోళన ఎందుకు?కేంద్రం దిగివచ్చిన కారణాలేంటి? రాజకీయ లబ్ది కోసమే కేంద్రం సాగు చట్టాల్ని రద్దు చేసిందా?

3 Farm Laws : 3 వ్యవసాయ చట్టాల్లో ఉన్నవిషయాలేంటి..?రద్దు చేయాలని రైతులు ఆందోళన ఎందుకు?కేంద్రం దిగివచ్చిన కారణాలేంటి?

3 Agricultural Laws Canceled (1)

3 agricultural laws Canceled : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు భగ్గుమన్నారు. కుటుంబాలను వదలేసి నడి రోడ్లపై నెలల తరబడి ఆందోళన కొనసాగించారు. పోలీసుల లాఠీ దెబ్బల్ని కూడా లెక్క చేయకుండా వ్యవసాయ పొలాలను తమ ఇంటి మహిళలకు అప్పగించేసి రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. ఎన్నో కష్టాలు పడ్డారు.అయినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. 40కి పైగా రైతు సంఘాలు పాల్గొన్న ఈ రైతుల ఆందోళనలకు ఎన్నో సంఘాలు..స్వచ్ఛంధ సంస్థలు మద్దతు పలికాయి. తమకు తోచిన సహాయ సహకారాలు అందించాయి. విదేశీ అధినేతల దృష్టికి కూడా వెళ్లింది రైతులు ఆందోళనలు. కొన్ని దేశాధినేతలు రైతుల ఆందోళన సరైనదేనని..దీనిపై భారత ప్రభుత్వం ఆలోచించాలని సూచించినా..ఇది మా అంతర్గత వ్యవహారమని కేంద్రం అప్పట్లో అన్న విషయం తెలిసిందే.

అలా 2020 నవంబర్ 26న రైతుల ప్రారంభమైన రైతుల నిరసనలు కేంద్రం దిగి వచ్చేవరకు ఆపేది లేదని తేల్చి చెప్పాయి. ఈ క్రమంలో కేంద్రంతో రైతుల సంఘాల నేతలు పలుమార్లు చర్చలు జరిపినా అవి ఫలించలేదు. కేంద్రం చెప్పే కల్లబొల్లి మాటలు మాకు అవసరం లేదు..తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే అనే మాటమీదనే నిలబడ్డారు రైతన్నలు. కేంద్రం పోలీసులతో ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తమ ఆందోళన విరమించలేదు. అలా రైతుల ఆందోళన సంవత్సరం దాటిపోయింది. ఈక్రమంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంటు ఎట్టకేలకు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఈ ప్రకటనను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే ప్రకటించారు.

Read more : Farm Laws Repeal : కేంద్రం సంచలన నిర్ణయం.. వ్యవసాయ చట్టాలు రద్దు: ప్రధాని మోదీ

మరి కేంద్రం తీసుకొచ్చిన ఈ వ్యవసాయంచట్టాల్లో ఏముంది? రైతులు ఈ చట్టాలను ఎందుకు వ్యతిరేకించారు? పట్టువదలని విక్రమార్కుడిలా రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాదికిపైగా ఆందోళన ఎందుకు చేశారు. ఈ చట్టాల వల్ల వారికి ఎటువంటి నష్టాలున్నాయి?కేంద్రం ఈ చట్టాలను రద్దు చేయటానికి వెనుక ఉన్న కారణాలేంటీ? కేవలం రాజకీయ లబ్ది కోసమే ఈ చట్టాల్ని రద్దు చేయాల్సి వచ్చిందా? అనే విషయం తెలుసుకుందాం..

వ్యవసాయ చట్టంపై ఆర్డినెన్స్..పార్లమెంట్ లో బిల్లులు..
వ్యవసాయ చట్టంపై కేంద్రం జూన్ 15, 2020న ఆర్డినెన్స్ ప్రవేశపెట్టింది. 2020 సెప్టెంబర్ 17న బిల్లులకు లోక్ సభ ఆమోదం పలికింది. 2020 సెప్టెంబర్ 20న బిల్లులకు రాజ్యసభ ఆమోదం లభించింది. 2020 సెప్టెంబర్‌ 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ సాగు చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు. వేలాదిగా రైతులు స్వచ్చందంగా కదలివచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లో పోరుబాట పట్టారు.2020 నవంబర్ 26న రైతుల నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ ఆందోళనల్లో 40కి పైగా రైతు సంఘాలు పాల్గొన్నాయి. డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చి.. విజయవంతం చేశారు. ఈ ఆందోళనల్లో ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.వారి ప్రాణత్యాగాలు భరించలేకపోయినా రైతన్నలు వారి ప్రాణత్యాగాలకు సరైన నివాళి అర్పించాలనుకున్నారు. చట్టాలు రద్దు చేయింటమే వారికి అర్పించే ఘన నివాళి అని నమ్మారు. అలా ఆందోళన కొనసాగించి ఎట్టకేలకు కేంద్రం మెడలు వచ్చి సాగు చట్టాల్ని రద్దు చేయించారు.

Read more : Three Farm Laws: రైతు చట్టాల రద్దు.. తేదీల వారీగా వివరాలు

డిసెంబర్ 20న అమరవీరుల స్మారక దినంగా పాటించారు రైతులు. డిసెంబర్ 23న రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. జనవరి 26న ఎర్రకోట దగ్గర రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ర్యాలీ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసింది. ఇండియాపై ఫోకస్‌ పెట్టేలే చేసిన ఈ ర్యాలీ రైతుల ఆందోళనలో కీలకంగా మారింది. ఇక 2020 అక్టోబర్ 2020 నుంచి జనవరి 2021 వరకు 11 విడతలుగా రైతులు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. కానీ కేంద్రం చెప్పే మాటలు..రైతులకు నచ్చలేదు. చర్చలు ఫలించలేదు.

ఈక్రమంలో జనవరి 2021న ఈ కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్.. మొత్తం 6 రాష్ట్రాల ప్రభుత్వాలు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. పంజాబ్, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్ రాష్ట్రాలు కౌంటర్ చట్టాలు ప్రవేశపెట్టాయి. అలా పలు రాష్ట్రాల ప్రభుత్వాల్ని కదిలించాయి రైతులు ఆందోళనలు.

మూడు సాగు చట్టాలు చెబుతోంది ఏంటి? కేంద్రం ఇన్నాళ్లూ ఈ బిల్లులపై ఏమని సమర్థించుకుందో పాయింట్ల వారిగా తెలుసుకుందాం..ఈ బిల్లుల్లో ఏమని పేర్కొందో చూద్దాం..

Bill 1 : ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు(సాధికారత,రక్షణ) 2020-బిల్లు
రైతులు పండించబోయే పంటలకు ముందుగానే ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం
నిర్ణీత కాలానికి ప్రైవేట్ వ్యాపారి రైతుతో పంటల కొనుగోలు విషయంలో ఒప్పందం చేసుకోవాలి.
రైతులు ఎవరికైనా తమను పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు..
టెక్నాలజీతో పంటలు అమ్ముకోవచ్చు..
ప్రైవేట్ వ్యాపారులతో కాంట్రాక్ట్ ద్వారా 5హెక్టార్ల లోపు భూమి ఉన్న చిన్న,సన్నకారు రైతులకు లబ్ది

Bill2: నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు 2020 బిల్లు
ధాన్యం, నూనె గింజలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగింపు..అంటే ఇవి అమ్ముకోవాలంటే ఆ పంటలు పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకం ఉండదు..

ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మే పెద్ద కంపెనీల గుత్తాధిపత్యానికి తెర
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం
తద్వారా పోటీ వాతావరణం ఏర్పడి సప్లై చైన్ ఆధునీకరించబడే అవకాశం
కోల్ట్ స్టోరేజీలు,వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఆధునిక సదుపాయాల కల్పన

Bill 3: వ్యవసాయ ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020
ఉత్పత్తుల అమ్మకాలు-కొనుగోళ్లకు రైతులు-ప్రైవేట్ వ్యాపారులకు స్వేచ్చ
రైతులు తమ ఇష్టానుసారం ఎవరికైనా పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు
మార్కెట్ యార్డులకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు
కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేదు
ధరల నియంత్రణ రైతులు-ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోనే
ప్రైవేట్ వ్యాపారులే రైతు వద్దకు వచ్చి కొనుగోలు
మార్కెటింగ్/రవాణా ఖర్చులు,ఇబ్బందులు ఉండవు
అంతరాష్ట్ర వాణిజ్యం మరింత సులభతరం

దీనిపై రైతులు వ్యతిరేకత ఎందుకు?
ఈ చట్టాల వల్ల రైతులకు జరిగే మేలు ఏమాత్రం ఉండదు. కార్పొరేట్ సంస్థలకే ఇవి మేలు చేస్తాయంటున్నారు రైతులు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఈ చట్టం అవకాశం ఇస్తున్నా.. ఎంత మంది రైతులు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయించగలరనేది ని రైతు సంఘ నాయకుల ప్రశ్న..

కేవలం కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు.. వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ తరువాత రాష్ట్రాలు దాటిస్తూ వ్యాపారం చేసుకుంటాయని చెబుతూ.. ఇప్పటికే నూనెగింజలు, నూనెలు, పప్పుధాన్యాలు వంటి ఉత్పత్తులు కార్పొరేట్ల గుత్తాధిపత్యంలో ఉన్నాయని.. ఇకపై దేశంలోని అన్ని వ్యవసాయ ఉత్పత్తులకీ అదే గతి పడుతుందని రైతులకున్న అభిప్రాయం.

Read more : New Farm Laws : వ్యవసాయ చట్టాలు రద్దు…ఇది రైతు విజయం

ఇంతవరకు వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ రాష్ట్రాల పరిధిలో ఉండేది. వరదలు, తుపాన్లు వచ్చినప్పుడు.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు దిగుబడులు తగ్గి సొంత అవసరాలకే పంట ఉత్పత్తులు చాలని పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ఉత్పత్తులు తమ సరిహద్దులు దాటకుండా నియంత్రణ విధించే వెసులుబాటు ఉండేది. కొత్త చట్టాలలో ఆ అవకాశం లేదు. దేశమంతటా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలాంటప్పుడు రాష్ట్రాలు తమ సొంత ప్రయోజనాలు కాపాడుకోలేని స్థితికి చేరుకుంటాయి. ఇదీ రైతు నేతల విశ్లేషణ.

కానీ ఈ కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనకరమైనవని, రైతులను కొందరు రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని ప్రధాని మోడీ గతంలో పదే పదే చెప్పారు. వ్యవసాయ చట్టాలకు చేసిన సవరణల వల్ల రైతులకు ఉన్న ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయని కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. కానీ మరి ఇన్ని పాయింట్లు చెప్పిని ప్రధాని ఎందుకు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నామని రైతుల కష్టాలు అర్థం చేసుకున్నాయని సడెన్ గా యూ టర్న్ తీసుకుని మూడువ్యవసాయంచట్టాల్ని ఎందుకు రద్దు చేశారు? అనేది ఆసక్తికరమనే చెప్పాలి. దీనిపైనే చర్చ కొనసాగుతోంది.

Farm Laws : వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఐదు కారణాలు!
కేంద్రం రైతుల కోసమే ఈ చట్టాలు అన్నారు. రైతుల మేలు కోసం తాము ఈ చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. కానీ ఈ చట్టాలు రైతుల మేలు కోసం కాదని గొంతెత్తి అరుస్తున్నా..కేంద్రం వినిపించుకోలేదు.కానీ అనూహ్యంగా..వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంత సడన్‌గా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది…? అనే చర్చ కొనసాగుతోంది. దీని వెనుక కారణంపై విశ్లషకులు ఏమంటున్నారో చూద్దాం..

రాజకీయ లబ్ది కోసమే చట్టాల రద్దా?
ముఖ్యంగా కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.. రైతు ఆందోళనల్లో పాల్గొనే మేజారిటీ రైతులంతా ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వారే. దీంతో ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై తప్పకుండా పడే అవకాశం ఉందని బీజేపీ ప్రభుత్వం గ్రహించింది. దీంతో చట్టాలను వెనక్కి తీసుకోవడమే సరైన నిర్ణయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Read more : Farm Laws : వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఐదు కారణాలు!

దీనికి తోడు నూతన వ్యవసాయ చట్టాలను తమ అస్త్రంగా మార్చుకొని ప్రచారాన్ని ప్రారంభించాయి విపక్షాలు.. పంజాబ్‌, యూపీలో కాంగ్రెస్‌ ఇప్పటికే దీన్ని అస్త్రంగా మలుచుకొని ఎన్టీఏ సర్కార్‌పై విరుచుకపడుతోంది. దీంతో సరిగ్గా కొన్ని నెలల ముందు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో విపక్షాలకు అస్త్రం లేకుండా చేయడమనేది మరో వ్యూహంగా కనిపిస్తోంది. ఇక ఈ నిర్ణయంతో తమది రైతు పక్షపాత ప్రభుత్వమనే చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

అంతేగాకుండా నెలల తరబడి అంటే దాదాపు ఏడాదిగా  ఆందోళన చేస్తున్న రైతుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోంది.. రోజుకో తీరుతో వాళ్లు ఆందోళనలు చేపట్టడం. నిరసనలు రోజురోజుకు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుండటం.. ఒక్కో రాష్ట్రం నూతన వ్యవసాయ చట్టాలపై గొంతెత్తుండటంతో మోగుతున్న డేంజర్‌ బెల్స్‌ను ముందే గ్రహించి వెనక్కి తీసుకుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఎట్టకేలకు రైతు చట్టాలను కేంద్రం వెనక్కితీసుకోవడంపై.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.