Kangana Ranaut: సిక్కులను కించపరిచే కామెంట్లు చేసిందని కంగనాపై ఎఫ్ఐఆర్

బాలీవుడ్ నటి కంగనా రనౌట్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రైతుల ఉద్యమాన్ని ఖలిస్తాని ఉద్యమంగా అభివర్ణిస్తూ ఇన్‌స్ర్టాగ్రామ్‌లో కంగనా పలు అనుచిత వ్యాఖ్యలు చేసింది. సిక్కుల మనో భావాలు....

Kangana Ranaut: సిక్కులను కించపరిచే కామెంట్లు చేసిందని కంగనాపై ఎఫ్ఐఆర్

Kanagan Ranuat

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌట్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రైతుల ఉద్యమాన్ని ఖలిస్తాని ఉద్యమంగా అభివర్ణిస్తూ ఇన్‌స్ర్టాగ్రామ్‌లో కంగనా పలు అనుచిత వ్యాఖ్యలు చేసింది. సిక్కుల మనో భావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆ సంఘం నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్ 19న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఒక్కసారిగా రెచ్చిపోయింది. కేంద్రవైఖరికి వంత పాడుతూ కామెంట్లు చేసిన కంగనా.. కేంద్రం తగ్గినా ఆమె మాత్రం ఉద్యమానికి వ్యతిరేకమే అన్నట్లు కామెంట్ చేసింది.

కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రోజు.. సిక్కు మతస్థులందరినీ ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చుతూ కామెంట్లు చేసింది. దీంతో మహరాష్ట్ర ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గురునానక్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన చేశారు. అనంతరం.. కంగనా రనౌత్.. సిక్కులపై తీవ్రవ్యాఖ్యలు చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేసింది.

…………………………………: ఫిబ్రవరిలో ఒకటి.. అక్టోబర్‌లో మరొకటి!

సిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులని అభివర్ణించడంతోపాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చితకబాదినట్లు.. బూట్ల కింద దోమల్లా నలిపివేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారికీ అలాంటి గురువు కావాలంటూ రాసుకొచ్చారు.