Kangana Ranaut interesting comments on the American elections
Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం సినిమాలతోనే కాకుండా వివాదాలకు ఈ నటి కేరాఫ్ అడ్రెస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈమె సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. నిరంతరం బయట జరిగే విషయాలపై తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటుంది.
అయితే నిజానికి కంగనా ఇండియన్.. కానీ అమెరికాలో ఓటు వెయ్యకపోయినప్పటికీ అక్కడి ఎలక్షన్ విషయాల గురించి చెప్పింది. తాజాగా అమెరికా ఎన్నికల సందర్బంగా తన ఎంపిక ఎవరో వెల్లడించింది. కంగనా తన సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఫోటో ఉన్న ఓ పోస్ట్ షేర్ చేస్తూ..“నేను అమెరికన్‌ని అయితే, కాల్చి చంపినా, తప్పించుకున్నా, లేచి, తన ప్రసంగాన్ని కొనసాగించిన టోటల్ కిల్లర్ కి నేను ఓటు వేస్తాను” అని పేర్కొంది.
గతంలో ట్రంప్ పై ఓ సారి దాడి జరిగింది. ఆ సంఘటన అమెరికా ప్రజలను ఒక్కసారిగా భయపెట్టింది. ఇప్పటి వరకు ఈ సంఘటనను అమెరికా ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఈ విషయాన్నే కంగనా మరో సారి ఇలా పేర్కొంది.