Kangana Ranaut: సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన స్టార్ బ్యూటీ!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కంగనా స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. ఇందిరా హయాంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమాను కంగనా తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఆమె ప్రొడ్యూస్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Kangana Ranaut Mortgages All Her Properties

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కంగనా స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. ఇందిరా హయాంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమాను కంగనా తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఆమె ప్రొడ్యూస్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Kangana Ranaut : రాజమౌళికి దేశ ధర్మంపై ఉన్న ప్రేమ చూస్తుంటే గర్వంగా ఉంది.. కంగనా!

అయితే ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడుతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో కంగనా డెంగ్యూ బారిన పడటం.. ఆ తరువాత ఈ సినిమా కోసం ఆమె తన ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కంగనా పూర్తి చేసినట్లు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టినట్లుగా ఆమె పేర్కొంది.

Kangana Ranaut : మా అక్కపై యాసిడ్ దాడి జరిగింది.. కంగనా రనౌత్!

ఈ సినిమా కోసం తాను శారీరకంగా, మానసికంగా కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నట్లుగా ఆమె తెలిపింది. ఇక కంగనా ప్రస్తుత పరిస్థితి గురించి తన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కోరింది. ఏదేమైనా కంగనా కమిట్మెంట్‌కు హ్యాట్సాఫ్ అంటున్నారు అభిమానులు.