Kangana Ranaut : రాజమౌళికి దేశ ధర్మంపై ఉన్న ప్రేమ చూస్తుంటే గర్వంగా ఉంది.. కంగనా!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టిస్తుంది. ఇక ఇప్పుడికే పలు ఇంటర్నేషనల్ వేదికల్లో చోటు దక్కించుకుంటున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి అవార్డులను కైవసం చేసుకుంటుంది. అయితే ఈ అవార్డుల వేడుకల్లో రాజమౌళి భారతీయ సాంప్రదాయ వస్త్రధారణలో దర్శనమిచ్చాడు. కాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, రాజమౌళి వస్త్రధారణపై ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది.

Kangana Ranaut : రాజమౌళికి దేశ ధర్మంపై ఉన్న ప్రేమ చూస్తుంటే గర్వంగా ఉంది.. కంగనా!

kanaga ranaut says she proud to see Rajamouli's love for the nation

Updated On : January 13, 2023 / 7:08 AM IST

Kangana Ranaut : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టిస్తుంది. ఈ చిత్రం విడుదలయ్యి నెలలు గడుస్తున్నా, ఇంకా వరల్డ్ వైడ్ గా RRR మానియా కనిపిస్తూనే ఉంది. ఫారిన్ కంట్రీస్ లో కూడా ఈ మూవీని ఎందుకు ఇంతలా ఆదరిస్తున్నారో రాజమౌళికే అర్ధమకావడం లేదు అని తెలియజేస్తున్నాడు. ఇక ఇప్పుడికే పలు ఇంటర్నేషనల్ వేదికల్లో చోటు దక్కించుకుంటున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి అవార్డులను కైవసం చేసుకుంటుంది.

Upasana : RRR సక్సెస్‌ని నా బేబీ కూడా ఎక్స్‌పిరెన్స్ చేస్తుంది.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్!

ఇటీవల న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ నామినేషన్స్ లో.. రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకమైన పురస్కారం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో అవార్డుని అందుకుంది ఈ సినిమా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ఈ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ విన్నర్ గా నిలిచింది. దీంతో మూవీ టీంకి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ రెండు అవార్డుల వేడుకల్లో రాజమౌళి భారతీయ సాంప్రదాయ వస్త్రధారణలో దర్శనమిచ్చాడు.

కాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, రాజమౌళి వస్త్రధారణపై ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మీ సినిమాలతో భారతీయ సినిమాని ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ పై నిలబెట్టడం ఒక గొప్ప విషయం అయితే, మరొకటి మీ వస్త్రధారణ. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ప్రతి అంతర్జాతీయ వేడుకల్లో మీరు దోతిలో వెళ్లడం చూస్తుంటే.. మీకు దేశ ధర్మం పై ఎంతటి ప్రేమ ఉందో అర్ధం అవుతుంది. సినిమాతో పాటు, భారతీయ ధర్మం పై మీరు చూపించే ప్రేమ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.