సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల మణికర్ణిక అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కంగనా నటనకి ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుతం తాను తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, అలనాటి నటి జయలలిత బయోపిక్‌లో నటించేందుకు సిద్దమైంది. తలైవీ అనే టైటిల్ తో విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు.
తమిళ ప్రజలు ‘పురచ్చి తలైవి’గా పిలుచుకునే జయలలిత బయోపిక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విబ్రి, కర్మ మీడియా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించనున్నారు.
విజయేంద్ర ప్రసాద్‌తో కంగనా రనౌత్ కలిసి పనిచేయడం ఇది రెండోసారి…కాగా, ఈ చిత్రం తమిళంలో ‘తలైవి’గా, హిందీలో ‘జయ’గా తెరకెక్కబోతోంది. కంగనా రనౌత్ ఇది తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. నిత్యామీనన్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, పేపర్ టేల్ పిక్చర్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ,భాషలలో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది జయలలిత. ఆమె గొప్ప రాజకీయవేత్త. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌తో నేను అమె బయోపిక్ చేయడం నాకు చాలా గొప్ప విషయం.. ఆమె పాత్రలో నటిస్తుండడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను అని చెప్పింది కంగనా.