Kangana Ranaut : డేటింగ్ యాప్స్, లివ్-ఇన్ కల్చర్ పై కంగనా ఫైర్.. గర్భం వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు?

తాజాగా ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ ఈ డేటింగ్ యాప్స్, లివ్-ఇన్ కల్చర్ పై ఫైర్ అయింది.

Kangana Ranaut

Kangana Ranaut : మన దేశంలో ఇటీవల డేటింగ్ యాప్స్, లివ్-ఇన్ కల్చర్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇవి మంచి కంటే చెడునే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాయి అని అంటున్నారు. తాజాగా ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ ఈ డేటింగ్ యాప్స్, లివ్-ఇన్ కల్చర్ పై ఫైర్ అయింది.

ఓ ఇంటర్వ్యూలో సహజీవనం గురించి ప్రశ్నించగా కంగనా రనౌత్ మాట్లాడుతూ.. దేశంలో లివ్-ఇన్ కల్చర్ పెరగడానికి కారణం డేటింగ్ యాప్స్. లివ్-ఇన్ రిలేషన్ లో మహిళకు గర్భం వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఒకవేళ అబార్షన్ చేయిస్తే ఎవరు చేయిస్తారు? అబార్షన్ వద్దు, పిల్లల్ని కనాలి అనుకుంటే వాళ్ళను ఎవరు సంరక్షిస్తారు? అప్పటివరకు లివ్ ఇన్ లో ఉన్న అబ్బాయి పారిపోడని గ్యారెంటీ ఏంటి?

Also Read : Anchor Sowmya : ఆర్సీబీ క్రికెటర్స్ పై యాంకర్ ఫైర్.. వాళ్ళు జస్ట్ క్రికెటర్స్ దేవుళ్ళు కాదు.. మన కోసం ఏం చేయరు..

అదే పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య ఓ బంధం ఉంటుంది. ఆ బంధానికి రక్షణగా తల్లితండ్రులు, బంధువులు ఉంటారు. తమపై తమకు నమ్మకం లేనివాళ్లే డేటింగ్ యాప్స్ ని వాడతారు. అక్కడంతా లూజర్స్ ఉంటారు. సరైన సంబంధం వెతుక్కోవడం రాని మీకు డేటింగ్ యాప్స్ లో లైఫ్ పార్ట్నర్ దొరుకుతారని ఎలా అనుకుంటారు?ఆడ పిల్లలకు సామాజిక భద్రతతో పాటు ఆర్ధిక స్వాతంత్య్రం ఉండాలి కానీ అది లివ్-ఇన్ కల్చర్ కోసం వాడటం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది.