Kangana Ranaut : సుశాంత్ ఆత్మహత్య వెనుక ప్రధాన నిందితులు వారే.. కంగనా సంచలన పోస్ట్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా మరోసారి సంచలన పోస్ట్ లు చేసింది. సుశాంత్ ఆత్మహత్య వెనుక ప్రధాన నిందితులు వారే అంటూ..

Kangana Ranaut viral post on Sushant Singh Rajput demise

Sushant Singh Rajput : బాలీవుడ్ లో (Bollywood) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య పై ఇప్పటికి చర్చ జరుగుతూనే ఉంటుంది. తనది సూసైడ్ కాదు, ఇండస్ట్రీలోని కొందరు పెద్ద వ్యక్తులు చేసిన పనులు వల్లే సుశాంత్ చనిపోయాడు అంటూ బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఇలా మాట్లాడే వారిలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు సుశాంత్ మరణం గురించి హాట్ కామెంట్స్ చేసిన కంగనా తాజాగా మరోసారి సంచలన పోస్ట్ లు చేసింది.

Adipurush : ఆదిపురుష్‌లో సీతగా కృతిసనన్‌ని ఎంపిక చేయడానికి రీజన్ తెలుసా.. కృతి చెప్పిన ఆన్సర్!

తన ఇన్‌స్టా స్టోరీలో కంగనా ఇలా రాసుకొచ్చింది.. “సినీ ఇండస్ట్రీలో రకరకాల బెదిరింపులు ఉంటాయి. కానీ ఈ దుర్యోధనుడు (తెల్ల ఎలుక), శకుని (పాప జో) చేసే వేధింపులు మరింత దారుణంగా ఉంటాయి. ఈ ఇద్దరు వాళ్లకి వాళ్లు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖగా ఫీలవతుంటారు. ఇండస్ట్రీలో వచ్చే ఫేక్ న్యూస్ లు అన్నిటికి కారణం వారిద్దరే అని పరిశ్రమలో ఉన్న అందరికి తెలుసు. అలా చేసే సుశాంత్ సింగ్ ని ఆత్మహత్య చేసుకొనేలా చేశారు. సుశాంత్ మరణానికి ప్రధాన నిందితులు వారే” అంటూ రాసుకొచ్చింది.

Kangana Ranaut viral post on Sushant Singh Rajput demise

అలాగే తన పై కూడా ఎన్నో అసభ్యకరమైన పుకార్లు సృష్టించారని, హృతిక్ రోషన్‌తో వివాదంలో తన పై ఎంతో దుష్ప్రచారం చేశారని, తన జీవితంలో వారి వేధింపులు శృతిమించి పోయాయని చెప్పుకొచ్చింది. కాగా కంగనా వారిద్దరి పేర్లు చెప్పకుండా దుర్యోధనుడు (తెల్ల ఎలుక), శకుని (పాప జో) అని మాత్రం చెప్పుకొచ్చింది. అయితే ఆ తెల్ల ఎలుక, పాప జో అని కంగనా.. రణ్‌బీర్‌, కరణ్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా పోస్ట్ చేసిందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ లు బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Kangana Ranaut viral post on Sushant Singh Rajput demise

Kangana Ranaut viral post on Sushant Singh Rajput demise