Adipurush : ఆదిపురుష్‌లో సీతగా కృతిసనన్‌ని ఎంపిక చేయడానికి రీజన్ తెలుసా.. కృతి చెప్పిన ఆన్సర్!

రామాయణ కథాంశంతో ప్రభాస్ రాముడిగా తెరకెక్కుతున్న సినిమాలో కృతి సనన్ సీతగా ఎందుకు ఎంపిక చేసుకున్నారో తెలుసా?

Adipurush : ఆదిపురుష్‌లో సీతగా కృతిసనన్‌ని ఎంపిక చేయడానికి రీజన్ తెలుసా.. కృతి చెప్పిన ఆన్సర్!

reason for Kriti Sanon casting as sita in Prabhas Adipurush

Updated On : June 11, 2023 / 7:31 PM IST

Adipurush Kriti Sanon : రామాయణ కథాంశంతో ప్రభాస్ (Prabhas) రాముడిగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా కనిపించబోతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కి సిద్దమవుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే కృతి సనన్ బాలీవుడ్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనని ఈ సినిమాలో సీతగా ఎంపిక చేసుకోవడానికి గల కారణం తెలియజేసింది.

Kriti Sanon : అతను నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేశాను.. కృతి సనన్!

కృతిసనన్ టాలీవుడ్ లోనే కెరీర్ స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ సినిమాలు హిట్టు అవుతున్నా.. ఈ అమ్మడు హైట్ కారణంగా అవకాశాలు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోతున్నాయి. అయితే ఆదిపురుష్ సినిమాలో ఆ హైట్ తనకి ఉపయోగపడిందట. ప్రభాస్ ఆరడుగులు ఎత్తని అందరికి తెలిసిన విషయమే. దీంతో ప్రభాస్ పక్కన సరిపోయే హైట్ లో కృతి ఉండడంతో మేకర్స్ తనని సంప్రదించినట్లు చెప్పుకొచ్చింది. అలా తన హైట్ ద్వారా సీత వంటి గొప్ప పాత్రని పోషించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది కృతి.

Raviteja : స్టార్ సినిమాటోగ్రాఫర్ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్..?

కాగా ఈ సినిమాని టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్స్ శరవేగంగా అమ్ముడు పోతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని ఇండియా వైడ్ IMAX థియేటర్స్ లో ఎక్కడా రిలీజ్ చేయడం లేదు. ఇక అమెరికాలో ఏమో ఆదిపురుష్ రిలీజ్ రోజే హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఫ్లాష్ (Flash) రిలీజ్ కూడా ఉంది. దీంతో ఈ మూవీ ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ కి పై ప్రభావం ఉండే అవకాశం ఉంది.