Kanguva glimpse released on the occasion of Suriya birthday
Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) తన 42వ సినిమాని పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. తమిళ మాస్ డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే అభిమానుల్లో అంచనాలని క్రియేట్ చేసిన మేకర్స్.. ఆ తరువాత టైటిల్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. ఈ చిత్ర షూటింగ్ ని దర్శకుడు శరవేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆడియన్స్ కి కంగువ సామ్రాజ్యని పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు.
Project K : ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని డిలీట్ చేసిన నిర్మాతలు.. మూవీ పై హాలీవుడ్ సంస్థ ట్వీట్ వైరల్..
ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. జులై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా కంగువ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయం తెలియజేస్తూ రిలీజ్ చేసిన సూర్య ప్రీ లుక్ ఆకట్టుకుంటుంది. ఆ లుక్ లో సూర్య చెయ్యి పై టాటూస్ ఉండి, చేతిలో ఆయుధంతో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్ చాలా వైల్డ్ గా ఉండబోతుంది. ఈ క్యారెక్టర్ కోసం సూర్య కండలు పెంచి బీస్ట్ మోడ్ లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ 50 శాతం పైగా పూర్తీ అయ్యందని సమాచారం. ఈ ఏడాది చివరి లోపు మొత్తం చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది మొదటి భాగంలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Mahesh Babu : గుంటూరు కారం కోసం మహేశ్ బాబు పాన్ ఇండియా రేంజ్ రెమ్యునరేషన్..?
Each scar carries a story!
The King arrives ?#GlimpseOfKanguva on 23rd of July! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth @KanguvaTheMovie #Kanguva ? pic.twitter.com/YLH0I3oO54
— Kanguva (@KanguvaTheMovie) July 20, 2023
ఇక ఈ మూవీతో బాలీవుడ్ భామ దిశా పటాని (Disha Patani) సౌత్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాహుబలి, KGF లాంటి సినిమాలకు తమిళ ఇండస్ట్రీ నుంచి సమాధానం ఇస్తాం అంటూ స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా గట్టి నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ ఆదివారం రిలీజ్ అయ్యే గ్లింప్స్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.