ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా(39) కన్నుమూశారు. హార్ట్ఎటాక్ సమస్యతో బాధపడుతూ బెంగళూరులోని జయనగర్ హాస్పిటల్ లో ఆదివారం(జూన్-7,2020)చిరంజీవి సర్జా తుదిశ్వాస విడిచారు. 20కి పైగా సినిమాల్లో చిరంజీవి సర్జా నటించారు. చిరంజీవి సర్జా…తెలుగువాళ్లకు బాగా పరిచమైన యాక్షన్ కింగ్ అర్జున్ అన్న కుమారుడు.
తీవ్రమైన ఛాతినోప్పి మరియు శ్వాసకోస సమస్యలతో శనివారం బెంగళూరులోని జయనగర్ లోని సాగర్ హాస్పిటల్ లో చిరంజీవి సర్జా చేరారు. హార్ట్ ఎటాక్ సమస్యతో కూడా బాధపడుతున్న ఆయనను బ్రతికించేందుకు డాక్టర్లు ప్రయత్నించగా..వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిరంజీవి సర్జా థ్రోట్ శ్వాబ్ శాంపిల్ ను టెస్టింగ్ కోసం పంపినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపారు.
2009లో వాయుపుత్ర సినిమాతో వెండితెరకు పరిచమైన చిరంజీవి సర్జాకు కన్నడ నటి మేఘనారాజ్ తో 2018లో వివాహమైంది. రెండు నెలల క్రితం లాక్ డౌన్ విధించే కొన్ని రోజుల ముందే అర్జున్ సర్జా నటించిన శివార్జున సినిమా విడుదలైంది.