Kannada Actor Dabbing for Prabhas Character in Salaar Movie
Salaar Movie : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా సలార్ (Salaar). ఈ సినిమాలో శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), జగపతి బాబు(Jagapathi Babu) విలన్స్ గా, శ్రియారెడ్డి కీలక పాత్రను పోషించింది.
ఇప్పటికే సలార్ సినిమా టీజర్ ని విడుదల చేసి ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుందని ప్రకటించి సినిమాపై మరింత హైప్ పెంచారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కానుందని, ఈ సారి మాత్రం వాయిదా పడదు అని ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే సలార్ సినిమాకి తెలుగులో ప్రభాస్ సొంత డబ్బింగ్ చెప్పినా వేరే భాషల్లో మాత్రం వేరేవాళ్ళతోనే చెప్పిస్తున్నట్టు సమాచారం. కన్నడలో అయితే నటుడు వశిష్ట సింహతో ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పిస్తున్నారు చిత్రయూనిట్. కన్నడ నటుడు వశిష్ట సింహ కన్నడ, తెలుగు, తమిళ్ లో నటుడిగా పలు సినిమాలు చేశాడు. పలు డబ్బింగ్ సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పాడు. తాజాగా సలార్ సినిమాలో ప్రభాస్ కి కన్నడ భాషలో వశిష్ట సింహ డబ్బింగ్ చెప్పాడట. ఇటీవలే ప్రభాస్ పార్ట్ డబ్బింగ్ పూర్తయిందని సమాచారం.
Also Read : Pawan Kalyan : వరుణ్ లావణ్యల పెళ్లి.. పవన్ పై వచ్చే మీమ్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..
ఇక శృతిహాసన్ మాత్రం అయిదు భాషల్లోనూ తానే స్వయంగా డబ్బింగ్ చెప్తున్నట్టు గతంలో ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. సలార్ లాంటి మాస్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ వాయిస్ కి తగ్గట్టు కన్నడలో వశిష్ట సింహ ఏ రేంజ్ లో చెప్తాడో చూడాలి.