Mandeep Roy : సినీ పరిశ్రమలో మరో విషాదం.. 500 పైగా సినిమాల్లో నటించిన నటుడు మృతి..

గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల సీనియర్ యాక్ట్రెస్ జామున, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మరణవార్త జీర్ణించుకోక ముందే మరో మరణవార్త సినీ పరిశ్రమని కలిచివేస్తుంది. కన్నడ సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నటుడు 'మన్‌దీప్ రాయ్' ఈరోజు (జనవరి 29) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Mandeep Roy

Mandeep Roy : గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రముఖ సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు స్వర్గస్తులు అవుతూ పరిశ్రమకి దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఇటీవల సీనియర్ యాక్ట్రెస్ జామున, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మరణవార్త జీర్ణించుకోక ముందే మరో మరణవార్త సినీ పరిశ్రమని కలిచివేస్తుంది. కన్నడ సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నటుడు ‘మన్‌దీప్ రాయ్’ ఈరోజు (జనవరి 29) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Jamuna : సినిమాలు, రాజకీయాలు, సమాజంలో ఎంతో సేవ.. అయినా కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని జమున ఆవేదన..

గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మన్‌దీప్.. క్రిందటి ఏడాది డిసెంబర్ లో గుండెపోటు రావడంతో కర్ణాటకలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. డాక్టర్లు గుండె ఆపరేషన్ చేయాలనీ సూచించడంతో, ఆపరేషన్ కి సిద్ధం అవుతున్న సమయంలో మళ్ళీ నేడు ఆయనకి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె అక్షిత తెలియజేసింది. ఇక మన్‌దీప్ రాయ్ మరణవార్త తెలుసుకున్న కన్నడ చిత్రసీమ ప్రముఖులు ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా మన్‌దీప్ రాయ్ బెంగాలీకి చెందిన వ్యక్తి. కానీ కన్నడ సినీ పరిశ్రమలో స్థిరపడిపోయారు. 1981లో ‘మించిన ఊట’ అనే సినిమాతో శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మన్‌దీప్ రాయ్.. తన సినీ కెరీర్ లో దాదాపు 500 పైగా సినిమాల్లో నటించారు. ఎక్కువుగా కామెడీ రోల్స్ చేస్తూ, తన యూనిక్ కామెడీ టైమింగ్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కాగా ఇటీవల శాండల్‌వుడ్‌కి చెందిన మరో సీనియర్ నటుడు ‘లక్ష్మణ్’ కూడా గుండెపోటుతో మరణించారు. దీంతో రోజుల వ్యవధిలో ఇద్దరి నటులను కోల్పోయి కన్నడ పరిశ్రమ బాధ పడుతుంది.