Kannada Actor Sampath passes away
Sampath : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా పలువురు ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా మరో యువనటుడు ఆత్మహత్య చేసుకున్నారు. కన్నడ(Kannada) టీవీ(TV) పరిశ్రమలో నటుడిగా పలు సీరియల్స్(Serials) లో నటిస్తున్నాడు సంపత్(Sampath). కన్నడలో అగ్నిసాక్షి(Agnisakshi) అనే సీరియల్ తో బాగా ఫేమస్ తెచ్చుకున్నాడు. సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు వేసి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపత్.
తాజాగా సంపత్ బెంగుళూరులోని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని మరణించాడు. 35 ఏళ్ళ వయసులోనే ఇలా ఆత్మహత్య చేసుకొని మరణించడంతో అంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. సంపత్ కు ఒక సంవత్సరం క్రితమే వివాహం అయింది. గత కొన్ని రోజులుగా అతనికి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, ఇంక అతనికి అవకాశాలు రావేమో అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. గత కొన్ని రోజులుగా తాను ఊహించినట్టు అవకాశాలు రాకపోవడం వల్లే బాధపడుతూ సడెన్ గా ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని సన్నిహితులు తెలిపారు.
Sarath Babu : ఇంకా హాస్పిటల్ లోనే శరత్ బాబు.. అత్యంత విషమంగా ఆరోగ్యం..
సంపత్ మరణంతో తన భార్య, కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు కన్నడ సినీ, టీవీ ప్రముఖులు అతనికి నివాళులు అర్పిస్తున్నారు. అయన స్వగ్రామం కర్ణాటక మంగుళూరు వద్ద నరసింహరాజపురలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆత్మహత్య కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.