Divya Spandana : అమ్మా నాన్న తర్వాత నాకు రాహుల్ గాంధీనే.. కన్నడ నటి వ్యాఖ్యలు..

ప్రస్తుతం ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే కర్ణాటక కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉంది దివ్య స్పందన. త్వరలో కర్ణాటక ఎలక్షన్స్ వస్తుండటంతో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా చేసిన ఓ ప్రచార కార్యక్రమంలో.....................

Divya Spandana :  కన్నడలో పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) సరసన అభి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రమ్య(Ramya) అలియాస్ దివ్య స్పందన(Divya Spandana). ఆ తర్వాత వరుసగా కన్నడ, తమిళ్ లో సినిమాలు చేస్తూ వస్తుంది. కెరీర్ మొదట్లో ఒకే ఒక్క తెలుగు సినిమా అభిమన్యు చేసింది. ప్రస్తుతం కూడా సినిమాలతో బిజీగానే ఉంది రమ్య. ఇక 2012 లో రాజకీయాల్లోకి ప్రవేశించిన రమ్య 2013 లోనే లోక్‌ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున మాండ్య(Mandya) నియోజకవర్గంలో ఎంపీగా గెలిచింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది.

ప్రస్తుతం ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే కర్ణాటక కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉంది దివ్య స్పందన. త్వరలో కర్ణాటక ఎలక్షన్స్ వస్తుండటంతో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా చేసిన ఓ ప్రచార కార్యక్రమంలో రమ్య రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Anasuya : అనసూయ పోస్ట్.. మళ్ళీ ఆంటీ అంటూ మొదలుపెట్టిన నెటిజన్లు..

రమ్య మాట్లాడుతూ.. నా తల్లితండ్రులంటే నాకు ప్రాణం. మా నాన్న చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంట్ కి వెళ్లాల్సి వచ్చింది. నాకు పార్లమెంట్ గురించి ఏమి తెలియదు, మరోవైపు మా నాన్న పోయిన బాధ. అలాంటి సమయంలో రాహుల్ గాంధీ నాకు తోడుగా నిలబడ్డారు. నాకు సహాయం చేశారు, మానసికంగా కూడా నాకు ధైర్యాన్ని ఇచ్చారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినా అప్పుడు కూడా రాహుల్ గాంధీ నా వెన్నంటే ఉన్నారు. నాకు మా అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీనే అని వ్యాఖ్యలు చేసింది. దీంతో రమ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు