Kannada Hero Prajwal Devaraj Karavali Movie Teaser Released
Karavali Teaser : తెలుగుతో పాటు ఇటీవల వేరే భాషల్లో కూడా మంచి మంచి కొత్త కథలు వస్తున్నాయి. త్వరలో కన్నడ పరిశ్రమ నుంచి కరావళి అనే సినిమా రాబోతుంది. వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో గురుదత్త గనిగ ఫిల్మ్స్ బ్యానర్ పై గురుదత్త గనిగ దర్శక నిర్మాణంలో కరావళి సినిమా తెరకెక్కుతుంది. ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా సంపద, మిత్ర ముఖ్య పాత్రల్లో నటించారు.
Also Read : Anurag Kashyap : బాలీవుడ్ మారట్లేదు.. నేను సౌత్ కి వెళ్ళిపోతాను స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..
ఇప్పటికే కరావళి సినిమా నుంచి ఫస్ట్ లుక్, ప్రోమోలు రిలీజ్ చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ చూస్తుంటే ఓ కుర్చీ, గేదెల చుట్టూ కథ తిరుగుతుందని, అది మాములు కుర్చీ కాదని, అది ఒక పిశాచి అని, మహిషాలకు, మానవులకు మధ్య జరిగే కాన్సెప్ట్‌లా చూపించారు. టీజర్ చూస్తుంటే ఏదో కొత్త కథతో హారర్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా కరావళి టీజర్ చూసేయండి..
కన్నడ హీరో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ కి ఇది 40వ సినిమా కావడం గమనార్హం. టీజర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. టీజర్లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరింది. ఈ సినిమాకు సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. కరావళి సినిమా 2025 లో రిలీజ్ కానుంది.
Also See : Balakrishna – Ram Charan : అన్‌స్టాపబుల్ షూట్ లో బాలయ్యతో చరణ్ – శర్వానంద్ సందడి.. ఫోటోలు చూశారా?