Yash 19 : హమ్మయ్య.. యశ్ 19 అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ అనౌన్స్ అప్పుడే..

రాకీ భాయ్ అభిమానులంతా యశ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడంటూ కొంత కాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అదిగో యశ్ 19 అప్డేట్, ఇదిగో అప్డేట్ అంటూ పలు వార్తలు ఊరించినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Kannada Star Yash Next Movie Yash 19 Update Announced

Yash 19 : కన్నడ హీరో ‘యశ్’ కేజీఎఫ్ (KGF) సినిమాలతో ఇండియా వైడ్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని, ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ 2 తరువాత ఈ హీరో ఏ సినిమా చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది. సినిమా వచ్చి సంవత్సరం పైనే అవుతున్నా యశ్ మాత్రం ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. అదిగో యశ్ 19 అప్డేట్, ఇదిగో అప్డేట్ అంటూ పలు వార్తలు ఊరించినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

రాకీ భాయ్ అభిమానులంతా యశ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడంటూ కొంత కాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీనికి యశ్ కూడా మధ్యలో ఓ సారి బదులిస్తూ.. ‘ఎదురు చూస్తూ ఉండండి. క్రేజీ అప్డేట్ ఇస్తాను’ అని చెప్పాడు. ఇటీవల మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ యశ్ 19 సినిమాని డైరెక్ట్ చేయబోతోందని వార్తలు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని తాజాగా యశ్ 19 సినిమా అప్డేట్ వచ్చింది.

Also Read : Janhvi Kapoor : ‘దేవర’ గురించి జాన్వీ కామెంట్స్.. అమ్మని గుర్తుచేసుకుంటూ..

యశ్ అధికారికంగా తన సోషల్ మీడియాలో యశ్ 19 అప్డేట్ ఇచ్చాడు. KVN ప్రొడక్షన్స్ నిర్మాణంలో యశ్ తన 19వ సినిమాని ప్రకటించాడు. యశ్ 19 టైటిల్ ని మాత్రం డిసెంబర్ 8 ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ప్రకటించనున్నట్టు అప్డేట్ ఇచ్చారు. అప్పుడే సినిమా డైరెక్టర్ ని కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. దీంతో యశ్ అభిమానులు ఈ సినిమా ప్రకటన కోసం, అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సారి యశ్ ఏ జోనర్ లో వచ్చి, ఎలాంటి సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పిస్తాడో చూడాలి.