Janhvi Kapoor : ‘దేవర’ గురించి జాన్వీ కామెంట్స్.. అమ్మని గుర్తుచేసుకుంటూ..

ఇప్పటికే దేవర(Devara) సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో 'తంగం' అనే క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది.

Janhvi Kapoor : ‘దేవర’ గురించి జాన్వీ కామెంట్స్.. అమ్మని గుర్తుచేసుకుంటూ..

Janhvi Kapoor Interesting Comments on Devara Movie Shoot

Updated On : December 4, 2023 / 11:03 AM IST

Janhvi Kapoor : శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) బాలీవుడ్(Bollywood) లో ‘దఢక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అయితే జాన్వీకి ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేకపోవడంతో ఇంకా స్టార్ హీరోయిన్ కాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది జాన్వీ కపూర్.

ఇప్పటికే దేవర(Devara) సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ‘తంగం’ అనే క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది. దేవర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించి మరిన్ని కమర్షియల్ సినిమాలు చేయాలని చూస్తుంది. ఆల్రెడీ దేవర సినిమా రెండు షెడ్యూల్స్ లో జాన్వీ పాల్గొంది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Ram Charan : మైసూరు చాముండేశ్వరి ఆలయంలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ లుక్ చూశారా?

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ‘దేవర’ నా మొదటి తెలుగు సినిమా. నేను ఆ భాషలో డైలాగ్స్ నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. మా అమ్మ ఇంట్లో ఉంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మాట్లాడేది. కానీ అమ్మ సౌత్ కి వస్తే సొంతిళ్ళులా ఫీల్ అవుతుంది. తమిళ్, తెలుగు బాగా మాట్లాడేది. దేవర సెట్ లో అడుగుపెట్టినప్పుడు నాకు కూడా నా ఇంటికి వచ్చినట్టు అనిపించేది. సెట్ లోని ప్రతి ఒక్కరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు అనిపిస్తుంది. ఎందుకో తెలీదు మా అమ్మతో నాకున్న అనుబంధం వల్ల ఈ సినిమా చేస్తుంటే అమ్మతో మరోసారి అటాచ్ అయినట్టు అనిపిస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా ఇస్తుంది అని తెలిపింది. దీంతో జాన్వీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక ఇటీవలే దేవర మరో షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలైనట్టు సమాచారం. దేవర రెండు పార్టులుగా వస్తుండగా మొదటి పార్ట్ 2024 ఏప్రిల్ 5న రానుంది.