Yash Meets Modi : మోదీని కలిసిన రాఖీ భాయ్, కాంతార టీం.. కన్నడ సినిమాపై ప్రశంసలు కురిపించిన మోదీ..

ప్రధాని మోదీ హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందుర్, KGF హీరో యశ్, కాంతార హీరో రిషబ్ శెట్టి, మరికొంతమంది కన్నడ సినీ వ్యక్తులని కలిశారు. వారితో ప్రధాని సినీ పరిశ్రమ గురించి, సినీ పరిశ్రమ సమస్యలు, పలు అంశాలపై మాట్లాడి ఇటీవల వారు సాధించిన విజయాల్ని అభినందించారు...................

Yash Meets Modi :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం నాడు బెంగుళూరులో జరిగిన అతిపెద్ద ఏరో ఇండియా షోలో పాల్గొన్నారు. ఏరో ఇండియా షో 2023ని ఘనంగా ప్రారంభించారు ప్రధాని. ఈ కార్యక్రమంలో పాల్గొని పలువురు ప్రముఖులు, దేశ, విదేశీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ప్రజలని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఢిల్లీకి పయనం అయ్యేముందు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురిని కలిసి మాట్లాడారు.

ఇటీవల మన ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక కన్నడ సినీ పరిశ్రమ కూడా ఇటీవల భారీ విజయాలు సాధిస్తుంది. KGF సినిమాతో ప్రపంచానికి కన్నడ సినీ పరిశ్రమ వ్యాల్యూ తెలిసేలా చేశారు. ఇటీవల కాంతార సినిమాతో మరోసారి కన్నడ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఈ రెండు సినిమాలని కూడా హోంబలే ఫిలింస్ నిర్మించింది. ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో హోంబలే ఫిలిమ్స్ టాప్ పొజిషన్ లో ఉంది. దీంతో ప్రధాని మోదీ హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందుర్, KGF హీరో యశ్, కాంతార హీరో రిషబ్ శెట్టి, మరికొంతమంది కన్నడ సినీ వ్యక్తులని కలిశారు. వారితో ప్రధాని సినీ పరిశ్రమ గురించి, సినీ పరిశ్రమ సమస్యలు, పలు అంశాలపై మాట్లాడి ఇటీవల వారు సాధించిన విజయాల్ని అభినందించారు.

ప్రధానితో సమావేశం అయ్యాక హీరో యశ్ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమ పట్ల ఆయనకు ఉన్న నాలెడ్జి, విజన్ అద్భుతం. మనకి ఏమి కావాలి, పరిశ్రమ దేశానికి ఏం చేయగలదు అని అన్ని రకాల సమస్యల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. మా సినిమాలని, మా కష్టాన్ని అభినందించారు. ఆయన్ని కలవడం ఒక అద్భుతమైన అనుభవం అని తెలిపారు.

అనంతరం కాంతార హీరో రిషబ్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ఒక గొప్ప నాయకుడు. ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉంది. కన్నడ పరిశ్రమలో ఏం జరుగుతుంది, పరిశ్రమ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మనకు ఏమన్నా అవసరాలు ఉంటే అడగమన్నారు. పరిశ్రమకి వారి తరపున చేయగలిగే సాయం చేస్తామన్నారు. కాంతార సినిమాని అభినందించారు అని తెలిపారు.

Rajamouli-Mahesh : ఆస్కార్ వేడుక అయితే కానీ రాజమౌళి-మహేష్ సినిమా వర్క్ మొదలవ్వదేమో??

ప్రధాని మోదీ ఇలా కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖుల్ని కలిసి కన్నడ సినీ పరిశ్రమని అభినందించి, సినీ పరిశ్రమ సమస్యలపై కూడా చర్చించడంతో కన్నడ సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు