Kannada super hit movie 45 ott streaming update
45 OTT: కన్నడ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీ 45 అనే చెప్పాలి. ఈ సినిమాలో కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలు చేశారు. సరికొత్త కథలో, భారీ గ్రాఫిక్స్ తో, విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు అర్జున్ జన్యా తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విడుదల తరువాత కూడా ఆడియన్స్ నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక తెలుగులో ఈ సినిమా జనవరి 1న విడుదల అయ్యింది. అయితే, తాజాగా 45 మూవీ ఓటీటీ విడుదల గురించి అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. 45 మూవీ ఓటీటీ(45 OTT) హక్కులను జీ 5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలైన సరిగ్గా నెలకి అంటే జనవరి 23 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.
అదే రోజు నుంచి తెలుగులో కూడా స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉంది ఈ సినిమా. కానీ, ఆ విషయం గురించి పోస్టర్ లో మెన్షన్ చేయలేదు. మరి థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ను ఇస్తారు అనేది చూడాలి.
45 The Biggest Movie Of 2025
45 Streaming On Jan 23rd In Kannada Zee5#45TheMovie #KannadaZEE5 #45OnZEE5 #ZEE5Cinemas #ZEE5 pic.twitter.com/uUFZWCE04Y
— ZEE5 Kannada (@ZEE5Kannada) January 16, 2026