Kantara 2 trailer to be released on September 22nd
Kantara 2 Trailer: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా కన్నడలో టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కేవలం రూ.14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కాంతార సినిమాకు ప్రీక్వెల్ కాంతార చాప్టర్ వన్ ప్రకటించారు మేకర్స్(Kantara 2 Trailer). ఇండియా నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ నేపధ్యంలో, ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 22 సోమవారం మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల కానుంది. ఈ విషయాన్నీ అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదల తరువాత ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.