Bigg Boss 9 Telugu: భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. రచ్చ లేపుతున్న హరీష్ కామెంట్స్.. అదేమన్నా గుళ్లో గంటనా అంటూ స్పందించిన భార్య

బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం అందరి దృష్టి మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్ పైనే ఉన్నాయి. బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) అగ్ని పరీక్ష నుంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేంత వరకు ఆయన బిహేవియర్ చాలా వింతగా ఉంది.

Bigg Boss 9 Telugu: భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. రచ్చ లేపుతున్న హరీష్ కామెంట్స్.. అదేమన్నా గుళ్లో గంటనా అంటూ స్పందించిన భార్య

Haritha Harish's wife responds to negative comments about her husband

Updated On : September 19, 2025 / 5:54 PM IST

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం అందరి దృష్టి మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్ పైనే ఉన్నాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేంత వరకు ఆయన బిహేవియర్ చాలా వింతగా ఉంది. ఆయన ముక్కుసూటి తనాన్నీ కొంతమంది ఇష్టపడుతుంటే కొంతమంది మాత్రం ఓవర్ యాక్టింగ్ గా ఫీలవుతున్నారు. మాస్క్ మ్యాన్ ను బయటకు పంపండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి(Bigg Boss 9 Telugu) హరిత హరీష్ కూడా ఎప్పుడు గంభీరంగా, ఎవరితో సరిగా మాట్లాడకుండా ఉంటున్నారు. అందుకే ఆయనకు బయట నెగిటివిటీ ఏర్పడింది.

Ntr: యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం…స్వల్ప గాయాలు

ఇది చాలదన్నట్టు తాజాగా హరిత హరీష్ చేసిన కామెంట్స్ అటు బిగ్ బాస్ హౌస్ లో, ఇటు సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నాయి. ఇటీవల ఆయన మాట్లాడుతూ తన భార్యను కొట్టినట్టుగా చెప్పుకొచ్చాడు. అంతే, ఆ వ్యాఖ్యలను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హరిత హరీష్ భార్యను కొట్టే అంత సైకోనా, అలాంటి వారికి బిగ్ బాస్ హౌస్ లో ఉండే అర్హత లేదు అంటూ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఈ కామెంట్స్ హరిత హరీష్ కి నెగిటీవ్ కావడంతో ఈ విషయంపై స్పందించారు హరిత హరీష్ భార్య హరిత.

ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. “ఇదేమైనా గుడిలో గంటా? స్కూల్‌ బెల్లా? ఎప్పుడుపడితే అప్పుడు కొట్టడానికి? ప్రతి కుటుంబంలో గొడవలు సహజం. తను నన్ను కొట్టిన విషయం నాకే గుర్తులేదు. ఎందుకంటే.. మా మధ్య ఉన్న ప్రేమ అలాంటిది. 20 ఏళ్ల మా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. బిగ్ బాస్ షో కోసం అబద్ధం చెప్పకుండా ఆయన గుర్తుపెట్టుకుని మరీ చెప్పాడు. మాకు పెళ్ళై 15 ఏళ్లవుతోంది. ఇన్నిరోజులు దూరంగా ఎప్పుడూ లేము. నా భర్త చాలా మంచివాడు. కొంతమంది కావాలనే నెగెటివ్‌ చేస్తున్నారు. సీరియస్ మాత్రమే కాదు ఆయనలో మంచి కామెడీ యాంగిల్‌ ఉంది. అది బయటకు రాలేదు” అంటూ చెప్పుకొచ్చారు హరిత.