Kantara : తుళు లాంగ్వేజ్‌లో విడుదలకు సిద్దమవుతున్న కాంతార..

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కర్ణాటకలోని గ్రామదేవతల కథాంశంతో తెరకెక్కిన మూవీ ‘కాంతార’. ఇక ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో పలు రికార్డులు సృష్టించగా, తాజాగా ఓవర్‌సీస్ మరియు తుళునాడులో విడుదలకు సిద్ధమైంది. తుళునాడు అనేది...

Kantara : తుళు లాంగ్వేజ్‌లో విడుదలకు సిద్దమవుతున్న కాంతార..

Kantara is ready to release in tulu language

Updated On : November 25, 2022 / 5:38 PM IST

Kantara : రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కర్ణాటకలోని గ్రామదేవతల కథాంశంతో తెరకెక్కిన మూవీ ‘కాంతార’. హోంబేలె ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 30న కన్నడ విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. దీంతో చిత్ర యూనిట్ భారతీయ ఇతర భాషల్లో కూడా విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Kantara : ఓటిటిలో కాంతార సందడి మొదలైపోయింది..

ఇక ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో పలు రికార్డులు సృష్టించగా, తాజాగా ఓవర్‌సీస్ మరియు తుళునాడులో విడుదలకు సిద్ధమైంది. తుళునాడు అనేది కర్ణాటకలోని అంతర్గత భాగం, అక్కడ అందరూ తుళు లాంగ్వేజ్ మాట్లాడతారు. కాగా కాంతార సినిమాని డిసెంబర్ 2న తుళునాడులో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అలాగే నేడు ఓవర్‌సీస్‌ ఆడియన్స్ ముందుకు కూడా తీసుకు వెళ్లారు మేకర్స్. ఈ సినిమా ఇప్పటికే 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి రికార్డు సృష్టించింది. మరి ఈ రిలీజ్స్ తో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి. ఇక ఈ సినిమా గురువారం నుంచి ఓటిటి లోకి కూడా అందుబాటులోకి వచ్చేసింది. అయితే అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతున్న ఈ సినిమాలో.. మూవీకే ప్లస్ గా నిలిచిన ‘వరాహ రూపం’ సాంగ్ ని తొలిగించింది.