Site icon 10TV Telugu

Kantha Rao : ఎన్టీఆర్ ఏ‌ఎన్‌ఆర్ ఇండస్ట్రీకి రెండు కళ్ళైతే.. కాంతారావు వాటి మధ్య తిలకం వంటివారు.. ‘కాంతారావు’ శతజయంతి వేడుకలు..

Kantha Rao Centenary celebrations

Kantha Rao Centenary celebrations

Kanta Rao : తెలుగు వారికి కాంతారావు అంటే తెలియకపోవచ్చు గాని ‘కత్తి కాంతారావు’ అంటే మాత్రం తప్పక గుర్తుపడతారు. నవంబర్ 16న అయన శతజయంతి కావడంతో.. నిన్న రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కాంతారావు శతజయంతి వేడుకలు జరిగాయి.

Kantha Rao : సాయం చేయాలని కోరుతున్న ఒకప్పటి స్టార్ హీరో కుమారులు..

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఎఫ్.డి.సి చైర్మన్ అనిల్ కూర్మాచలం గారు, స్పెషల్ గెస్ట్‌గా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ గారు పాల్గొని కాంతారావుకి నివాళులు అర్పించారు. తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణికపాత్రలు ధరించిన కాంతారావు తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడని పలువురు కీర్తించారు.

ఈ సందర్భంగా ఎఫ్.డి.సి చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం గారు మాట్లాడుతూ.. ‘కాంతారావు 400కు పైగా సినిమాల్లో, జానపద చిత్రాల్లో కథానాయకుడిగా నటించి ఆ చిత్రాలకు ఓ ప్రత్యేకతను చేకూర్చి కత్తి కాంతారావుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కాంతారావు గారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా రాబోవు రోజుల్లో ప్రభుత్వం తరపున వివిధ కార్యక్రమాలను రూపొందించనున్నాము’ అని తెలియజేశారు.

జూలూరి గౌరీశంకర్ గారు మాట్లాడుతూ.. ‘కాంతారావు గారు సినిమాల్లో చేసిన కత్తి యుద్ధాలను చూసి చిన్నప్పుడు తాముకూడా కర్రలతో అలానే చేసేవాళ్ళము. కాంతారావు గురించి రాబోవు తరాలకు తెలియజేసేవిధంగా మరిన్ని కార్యక్రమాలు జరపడానికి తనవంతు సహకారం అందిస్తాము’ అని వెల్లడించారు.

హరికృష్ణ మాట్లాడుతూ… కాంతారావు గారు తెలుగు సినిమారంగంలో యన్టీఆర్, అక్కినేనిలకు సమకాలికులుగా సమానమైన గుర్తింపు పొందారు. అంతేకాకుండా “తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే, కాంతారావు వాటి మధ్య తిలకం వంటివారు” అని దాసరి నారాయణరావు గారు పొగిడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలమేరకు ప్రభుత్వం తరపున కాంతారావు గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడమేకాకుండా, ప్రతినెలా కాంతారావు గారి సతీమణికి జీవనభృతిని అందజేశామని’ అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంతారావు గారి కుమారుడు రాజా, పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ టీం, సినీప్రియులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version