Kantha Rao : సాయం చేయాలని కోరుతున్న ఒకప్పటి స్టార్ హీరో కుమారులు..

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి హీరోలకు పోటీ ఇస్తూ నటించిన నటుడు 'కాంతారావు'. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ సినిమాలలో.. పౌరాణిక, సాంఘిక మరియు జానపద కథలతో సహా నాలుగు వందలకు పైగా చలన చిత్రాలలో నటించి అలరించాడు ఈ సీనియర్ హీరో. నిర్మాత గాను దాదాపు ఐదు చిత్రాలను నిర్మించాడు. కాగా ఇప్పుడు అయన కుమారులు చాలా అధ్వాన స్థితిలో ఉన్నారు. తమకి సాయం...

Kantha Rao : సాయం చేయాలని కోరుతున్న ఒకప్పటి స్టార్ హీరో కుమారులు..

Kantha Rao's sons who want to help

Updated On : November 17, 2022 / 8:09 AM IST

Kantha Rao : నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి హీరోలకు పోటీ ఇస్తూ నటించిన నటుడు ‘కాంతారావు’. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ సినిమాలలో.. పౌరాణిక, సాంఘిక మరియు జానపద కథలతో సహా నాలుగు వందలకు పైగా చలన చిత్రాలలో నటించి అలరించాడు ఈ సీనియర్ హీరో. నిర్మాత గాను దాదాపు ఐదు చిత్రాలను నిర్మించాడు.

RGV : ఆత్మకి శాంతి కలగాలని కోరుకొను.. ఆత్మ తిరిగి రావాలని కోరుకుంటా దేవుడిని.. RGV!

కాంతారావు నారదుడు, కృష్ణుడు మరియు అర్జునుడి పాత్రలను పోషించడంలో ప్రసిద్ది చెందాడు. అతను బ్లాక్ బస్టర్ చిత్రం లవకుశలో లక్ష్మణుడిగా నటించాడు. కాగా ఇప్పుడు అయన కుమారులు చాలా అధ్వాన స్థితిలో ఉన్నారు. తమకి సాయం చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్కపుడు స్టార్ హీరోగా రాజ్యమేలిన కాంతరరావు తరవాతి కాలంలో అస్తీలు పోగుట్టుకొని చాలా ఇబ్బంధులు పడ్డాడు.

“ఒకప్పుడు మద్రాస్ లో పెద్ద బంగళాలో, సొంత ఇంటిలో ఉన్న మేము, ఇప్పుడు అద్ది ఇంటిలో ఉంటున్నామని. మా తండ్రి కాంతారావు ఆస్తులు అమ్ముకుని సినిమాలు చేశారని, ఇప్పుడు మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దయుంచి మాకు ఒక సొంత ఇంటిని కేటాయించండి” అంటూ తెలంగాణ ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేస్తున్నారు కాంతారావు కుమారులు. మరి వీరి ప్రస్థితిని చూసి సినీ పెద్దలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.