Kapil Sharma : తప్ప తాగి షారుఖ్ ఇంటికి వెళ్ళాను.. పిలవని పార్టీకి వెళ్లడంతో..

తాజాగా కపిల్ తప్ప తాగి షారుఖ్ ఇంటికి వెళ్లిన సంఘటన గురించి చెప్పాడు. కపిల్ మాట్లాడుతూ.. ''కపిల్‌ శర్మ షోతో నాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ఓ సారి నా కజిన్‌ షారుక్‌ ఖాన్‌...

Kapil Sharma : తప్ప తాగి షారుఖ్ ఇంటికి వెళ్ళాను.. పిలవని పార్టీకి వెళ్లడంతో..

Sharukh

Updated On : January 30, 2022 / 7:56 AM IST

 

Kapil Sharma :   బాలీవుడ్ టాప్ కమెడియన్ కపిల్ శర్మ ఎంత ఫేమసో మన అందరికి తెలిసిందే. తన కపిల్ శర్మ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే. ఆ రేంజ్ లో కపిల్ సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం కపిల్ శర్మ నెట్‌ఫ్లిక్స్‌లో ‘కపిల్‌ శర్మ: ఐయామ్‌ నాట్‌ డన్‌ ఎట్‌’ అనే షో చేస్తున్నారు. ఈ షోలో అనేక ఆసక్తికర విషయాలని వెల్లడిస్తున్నారు.

 

తాజాగా కపిల్ తప్ప తాగి షారుఖ్ ఇంటికి వెళ్లిన సంఘటన గురించి చెప్పాడు. కపిల్ మాట్లాడుతూ.. ”కపిల్‌ శర్మ షోతో నాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ఓ సారి నా కజిన్‌ షారుక్‌ ఖాన్‌ ఇంటిని చూడాలని ఉందని చెప్పింది. అప్పుడు నేను ఫుల్ గా తాగి ఉన్నాను. అయినా సరే అదేం పట్టించుకోకుండా చలో అంటూ కారు తీసుకుని వెళ్లాం. అప్పుడు షారుఖ్ ఇంట్లో ఏదో పార్టీ జరుగుతుంది. సెక్యూరిటీ గార్డులు నన్ను చూసి పార్టీకి ఆహ్వానించారేమోననుకుని గేట్లు తెరిచారు. లోపలకు ఎంటర్‌ అయ్యాం కానీ మేము చేస్తోంది తప్పనిపించి బయటకు వెళ్లిపోదాం అనుకున్నాం. కానీ అంతలోనే షారుక్‌ మేనేజర్‌ మమ్మల్ని చూసి ఆహ్వానించాడు. అప్పుడు తెల్లవారుజామున 3 అవుతోంది. నేను నిక్కర్‌ వేసుకుని ఉన్నాను.”

Ashwin : కొత్త స్టైల్‌లో ‘పుష్ప’ పాటకి స్టెప్పులేసిన మరో క్రికెటర్

”షారుఖ్ ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా షారుక్‌ భార్య గౌరీ మేడమ్‌ తన ఫ్రెండ్స్‌తో ఉన్నారు. ఆమె కూడా నాకు ఇన్విటేషన్‌ అందిందేమోననుకుని పలకరించింది. షారుక్‌ లోపల ఉన్నాడంటూ ఓ గదివైపు వెళ్లమని చెప్పింది. అలా గదిలోకి వెళ్లగానే ఆయన ఎప్పటిలాగే డ్యాన్స్‌ చేస్తున్నారు. కొంత కంగారుపడుతూనే తన దగ్గరకు వెళ్లి భాయ్‌ సారీ.. నా కజిన్‌ మీ ఇల్లు చూడాలనుందంటే తీసుకువచ్చాను అని చెప్పాను. అప్పుడు షారుఖ్ నవ్వేసి నువ్వు ఇంట్లోకేంటి నా బెడ్‌రూమ్‌లోకి కూడా వచ్చేయచ్చు అన్నాడు. దీంతో ఒక్కసారిగా రిలీఫ్ అయ్యాను. ఆ తర్వాత ఇద్దరం డ్యాన్స్‌ చేశాం. తిరిగి వెళ్లేటప్పుడు ఆ పార్టీ స్టాఫ్‌ నాతో ఫొటోలు తీసుకున్నారు. వాటిని షారుక్‌ స్వయంగా తీశాడు’ అని తెలిపాడు.