Karate Kalyani
Karate Kalyani – MAA Association: సినీ నటి కరాటే కళ్యాణి(Karate Kalyani)ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA Association) నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె స్పందించింది. ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడినందుకే తనను ‘మా’ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారని కరాటే కళ్యాణి అంది. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చానని, తాను వేసిన పిటిషన్‌కు ‘మా’ అసోసియేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. సస్పెండ్ చేయడం పట్ల న్యాయపోరాటం చేయనున్నట్లు వెల్లడించింది. తాను ఎన్టీఆర్‌కి వీరాభిమానిని అని అయితే శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడాన్ని మాత్రం తాను వ్యతిరేకిస్తున్నట్లు మరోసారి చెప్పింది. తాను శ్రీకృష్ణుడిపై అభిమానంతోనే పిటీషన్ వేశానని, తనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలిపింది.
Karate Kalyani : కరాటే కల్యాణికి షాక్ ఇచ్చిన మంచు విష్ణు.. మా సభ్యత్వం రద్దు..
ఇంతకీ ఏం జరిగిందంటే..?
నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఎత్తులో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అయితే..కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ కళ్యాణి మీడియా ముందుకు వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Karate Kalyani : కరాటే కల్యాణికి ‘మా’ షోకాజ్ నోటీసులు!
ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి తాను వ్యతిరేకం కాదని, అయితే భగవంతుడైన శ్రీకృష్ణుడి రూపంలో వద్దంటూ గత కొద్ది రోజులుగా రచ్చ చేస్తోంది. దీనిపై సీరియస్ అయిన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్‌నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. కళ్యాణి ఇచ్చిన వివరణపై మా కార్యవర్గం సంతృప్తి చెందలేదని, ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో ‘మా’ నిబంధనల మేరకు కరాటే కళ్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు ‘మా’ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీ రఘు బాబు ఉత్తర్వులు జారీ చేశారు.