Karate Kalyani : నాకు ప్రాణహాని ఉంది.. నా కొత్త కారు టైర్స్ కోసేశారు.. జస్ట్ మిస్.. కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు..

తాజాగా కరాటే కళ్యాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ప్రాణహాని ఉందని ఇటీవల జరిగిన ఓ ఇన్సిడెంట్ ని తెలిపింది.

Karate Kalyani : నాకు ప్రాణహాని ఉంది.. నా కొత్త కారు టైర్స్ కోసేశారు.. జస్ట్ మిస్.. కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు..

Karate Kalyani sensational comments she says having threat to her

Updated On : June 7, 2023 / 12:16 PM IST

Karate Kalyani  :  గత కొన్ని రోజులుగా కరాటే కళ్యాణి ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల ఖమ్మంలో చేప్పట్టిన కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్(NTR) విగ్రహాన్ని అడ్డుకుంటూ రచ్చ చేసింది. కోర్టులు, కేసులు అంటూ మొత్తానికి ఆ విగ్రహావిష్కరణను ఆపించేసింది. ఈ విషయంలో పలువురితో గొడవలు కూడా పెట్టుకుంది కరాటే కళ్యాణి. ఈ విషయంలో బహిరంగంగానే వ్యాఖ్యలు, గొడవలు చేయడంతో పాటు, మూవీ ఆర్టిస్ట్ అసూసియేషన్ ఇచ్చిన నోటిస్ కూడా లెక్క చేయకపోవడంతో ఆమెను ‘మా'(MAA) నుంచి కూడా తొలగించారు.

‘మా’ నిర్ణయంపై కరాటే కళ్యాణి స్పందిస్తూ ఫైర్ అయింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాను అని తెలిపింది. తాజాగా కరాటే కళ్యాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ప్రాణహాని ఉందని ఇటీవల జరిగిన ఓ ఇన్సిడెంట్ ని తెలిపింది.

Varalxmi Sarath Kumar : అమ్మాయిలు భయం వదిలి బైక్ నడపండి.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్ నేర్చుకొని నడిపిన వరలక్ష్మి శరత్ కుమార్..

కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. నాకు ప్రాణహాని ఉంది. చాలా మందికి నాపై కోపం ఉంది. ఇటీవలే ఓ సంఘటన జరిగింది. నా కొత్త కారులో ఓ ప్రోగ్రాంకి వెళ్లి వస్తుంటే కారు టైర్స్ పేలిపోయాయి. హైవే మీద అయితే కచ్చితంగా కారు పల్టీ కొట్టేది. హైవే పక్కన చిన్న రోడ్ లో మెల్లిగా వెళ్తుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక సైడ్ ఉన్న టైర్స్ ని కోసేశారు. దాని వల్ల కారు ఎగిరే అవకాశం ఉంది. మెకానిక్ కి చూపిస్తే ఇవి కావాలని కోసినట్టే ఉందని అన్నాడు. నా మీద అంత కోపం పెట్టుకొని నా కొత్త కారుని అలా చేశారు. ఒకవేళ కార్ ఫాస్ట్ గా వెళ్లి ఉంటే ఏమన్నా జరిగేది అని సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఇది ఎవరు చేసి ఉండొచ్చు అంటే ఏమో తెలీదు, ఎవరైనా చేసి ఉండొచ్చు అని తెలిపింది.