Rashmika Mandanna : రష్మికకు బుద్ది చెప్తాము.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. సినిమా వాళ్లకు న‌ట్లు, బోల్టులు బిగిస్తాం..

రష్మిక మందన్న రెగ్యులర్ గా కన్నడ వివాదాల్లో నిలుస్తుందని తెలిసిందే.

Karnataka Congress MLA Fires on Rashmika Mandanna

Rashmika Mandanna : తాజాగా కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం సినిమా వాళ్లపై మండిపడ్డారు. బెంగుళూరులో ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది సినిమా స్టార్స్ హాజరు కాలేదు. కొంతమంది పిలిచినా హాజరు కాలేదు. దీనిపై అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఫైర్ అవుతున్నారు.

రష్మిక మందన్న రెగ్యులర్ గా కన్నడ వివాదాల్లో నిలుస్తుందని తెలిసిందే. గతంలో కూడా ఓ రెండు సార్లు కన్నడ ప్రేక్షకులు ఆమెను బహిష్కరించాలి అంటూ సోషల్ మీడియాలో హడావిడి కూడా చేశారు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో కన్నడ అమ్మాయి రష్మిక ఈ రాష్ట్రంలోనే తన కెరీర్ మొదలుపెట్టింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి హాజరు కావాలని ఆమెను చాలా సార్లు పిలిచాం. ఆమె మాత్రం అంగీకరించలేదు. నేను రాలేను అని, కర్ణాటకకు వచ్చేంత సమయం లేదు అని, నా ఇల్లు హైదరాబాద్ లో ఉంది, అసలు కర్ణాటక ఎక్కడో తెలీనట్టు మాట్లాడింది ఆమె. కన్నడ భాష పట్ల, కన్నడ సినీ పరిశ్రమ పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తోంది. ఆమెకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అని అన్నారు. దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Also Read : Ashu Reddy – Ariyana : టీవీ షోలో తిట్టుకున్న క్లోజ్ ఫ్రెండ్స్.. అషురెడ్డి – అరియనా.. ప్రోమో వైరల్..

మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా సినిమా వాళ్లపై ఫైర్ అయ్యాడు. బెంగుళూరు ఫిలిం ఫెస్టివల్ కి సినిమా వాళ్ళు ఎక్కువమంది రాకపోవడంతో ఆయన మాట్లాడుతూ.. సినిమా వాళ్ళు ఒకే తాటిపైకి రావాలి. రాష్ట్రంలో సినిమాలకు సంబంధించి కీలక కార్యక్రమం జరుగుతుంటే రాకపోతే ఎలా? వాళ్ళు రాకపోతే ఈ ఫిలిం ఫెస్టివల్ ప్రయోజనం ఏంటి. సినీ పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు అవసరం అని వాళ్ళు మర్చిపోకూడదు. సినిమా వాళ్ళ తీరు మారకపోతే వాళ్ళను ఏ విధంగా సరిచేయాలి నాకు తెలుసు. సినిమా వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవ‌స‌రం ఉంది అని అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఇలా డైరెక్ట్ గా సినిమా వాళ్లపై వ్యాఖ్యలు చేయడంతో వైరల్ గా మారాయి.

Also Read : NTR – Chhaava : సూపర్ హిట్ ‘ఛావా’ తెలుగు ట్రైలర్ రిలీజ్.. కానీ నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

అయితే ఈ వ్యాఖ్యలను సినిమా వాళ్ళు, బిజెపి నాయకులు ఖండిస్తున్నారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ వీటిపై స్పందిస్తూ అధికార గర్వంతో మాట్లాడుతున్నారు అని అన్నారు. మరి కర్ణాటకలో ప్రభుత్వం – సినీ పరిశ్రమ వివాదం ఎటు వైపు వెళ్తుందో చూడాలి.