Ashu Reddy – Ariyana : టీవీ షోలో తిట్టుకున్న క్లోజ్ ఫ్రెండ్స్.. అషురెడ్డి – అరియనా.. ప్రోమో వైరల్..

తాజాగా అషురెడ్డి - అరియనా ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రాంలో తిట్టుకున్నారు .

Ashu Reddy – Ariyana : టీవీ షోలో తిట్టుకున్న క్లోజ్ ఫ్రెండ్స్.. అషురెడ్డి – అరియనా.. ప్రోమో వైరల్..

Ashu Reddy and Ariyana Glory Fight in TV Show Promo goes Viral

Updated On : March 3, 2025 / 5:17 PM IST

Ashu Reddy – Ariyana : ఇటీవల కొంతమంది టీవీ షోలలో మాటల్లో ఏదైనా అభిప్రాయం బేధాలు వచ్చినా డైరెక్ట్ గానే తిట్టేసుకుంటున్నారు. కొంతమంది సరదాగా రేటింగ్ కోసం తిట్టుకోవడం చేస్తున్నారు. చాలా షో లలో నటీనటులు తిట్టుకోవడం చేస్తున్నారు అప్పుడప్పుడు. తాజాగా ఓ టీవీ షోలో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అరియనా – అషురెడ్డి తిట్టుకోవడం వైరల్ గా మారింది.

అరియనా, అషురెడ్డి ఇద్దరూ టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో పాపులర్ అయినవాళ్లే. సోషల్ మీడియా పాపులారిటీతో బిగ్ బాస్ లోకి వచ్చి ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అషురెడ్డి తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంటే అరియనా బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొంది. బిగ్ బాస్ అనంతరం ఇద్దరూ యాంకరింగ్, టీవీ షోలలో పాల్గొని ఇప్పుడు యాక్టింగ్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అషురెడ్డి, అరియనా టీవీ షోలతో, సినిమాల్లో యాక్టింగ్ తో బిజీగానే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో హడావిడి చేస్తారు.

Also Read : NTR – Chhaava : సూపర్ హిట్ ‘ఛావా’ తెలుగు ట్రైలర్ రిలీజ్.. కానీ నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

అయితే తాజాగా వీరిద్దరూ ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రాంలో తిట్టుకున్నారు. సుధీర్ యాంకరింగ్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రాంలో అషురెడ్డి ప్రతి ఎపిసోడ్ లోను ఉంటుంది. తాజాగా ఓ ఎపిసోడ్ లోకి అరియనా గ్లోరీ కూడా వచ్చింది.

అయితే ఈ ఎపిసోడ్ లో అషురెడ్డి మాట్లాడుతూ.. లాస్ట్ ఇయర్ నాకు ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. నేను ఒక ఫ్రెండ్ నుంచి కనీసం కాల్ వస్తుంది అని ఊహించాను. మా ఇంటికొచ్చి నన్ను చూస్తారు అనుకున్నాను. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు అరియనానే అని చెప్పింది. దీంతో అరియనా.. అషు నువ్వు ఇది ఇన్ని రోజులుగా మనుసులో పెట్టుకున్నావా. నీకు కాల్ చేస్తే మీ హెయిర్ డ్రెస్సర్ కాల్ లిఫ్ట్ చేసాడు. ఆంటీకి మూడు నాలుగు సార్లు చేసాను. కాల్ చేపిస్తా అన్నారు. ఒక సర్జరీ అయిన పేషంట్ ఇంకొకరికి వీడియో కాల్ లో అందుబాటులో ఉంటుంది కానీ ఇంకో ఫ్రెండ్ ని ఇగ్నోర్ చేస్తుంది అంటే అర్ధం ఏంటి అని అంది. దీంతో అషు.. బాగున్నప్పుడు ఏ ఎదవైనా వస్తాడు. బాగోలేనప్పుడే కదా రావాలి. సర్జరీ అయిన పేషేంట్ నుంచి నువ్వు కాల్ ఎక్స్ పెక్ట్ చేస్తావా? నువ్వే చేస్తావా? నా నంబర్ ఉంది కదా అని అంది. దీనికి అరియనా.. బ్లేమ్ చేయాలనుకుంటే చెయ్యి పర్లేదు అంటే అషు.. నిన్ను బ్లేమ్ చేస్తే నాకేమొస్తుంది అంది. అరియనా.. ఆమెకు నచ్చినప్పుడు మాట్లాడుతుంది. నచ్చనప్పుడు ఇగ్నోర్ చేస్తుంది. ఆమెకు చాలా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అని పక్కనున్న వాళ్ళతో అంది.

Also Read : Kiran Abbavaram : మార్కెట్ లో ఎక్కడా దొరకని బైక్.. మీకు కావాలా? అయితే కిరణ్ అబ్బవరం చెప్పిన పని చేయండి..

ఇలా వీళ్ళిద్దరూ కాసేపు షోలో పోట్లాడుకున్నారు. గత సంవత్సరం అషురెడ్డికి ఒక సర్జరీ అయి ఇంట్లో ఉంటే అరియనా పలకరించలేదని హర్ట్ అయి ఇప్పుడు దాని గురించి మాట్లాడటంతో అరియనా కూడా మాటకు మాట సమాధానం ఇవ్వడంతో ఇద్దరూ ఒకరిమీద ఒకరు ఫైర్ అయ్యారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరూ ఇలా టీవీ షోలో పోట్లాడుకోవడంతో ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి వీళ్ళు నిజంగానే షోలో పోట్లాడుకున్నారా? లేక ప్రోమో కోసం, షో రేటింగ్ కోసం పోట్లాడుకున్నారా తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాలి. ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి..