Kiran Abbavaram : మార్కెట్ లో ఎక్కడా దొరకని బైక్.. మీకు కావాలా? అయితే కిరణ్ అబ్బవరం చెప్పిన పని చేయండి..
కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

Kiran Abbavaram Gives Special Offer to Audience for Winning a Bike
Kiran Abbavaram : ఇటీవల కొంతమంది తమ సినిమాలను మరింత ప్రమోట్ చేయడానికి ఆడియన్స్ కి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఏదైనా గిఫ్ట్స్ లేదా డబ్బులు లేదా వాళ్ళని కలిసే ఛాన్స్.. ఇలా ఏవో ఒకటి స్పెషల్ ఆఫర్స్ పెడుతున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం కూడా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు ఆడియన్స్ కి.
యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే క సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు దిల్ రూబా సినిమాతో రానున్నాడు. శివమ్ సెల్యులాయిడ్స్ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్త నిర్మాణంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా విశ్వ కరుణ్ దర్శకత్వంలో దిల్ రూబా సినిమా తెరకెక్కుతుంది. కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా రానున్న ఈ సినిమా మార్చ్ 14న రిలీజ్ కాబోతుంది.
Also See : ‘పెళ్లి కానీ ప్రసాద్’ టీజర్ చూశారా? కట్నం క్యాష్ గానే కావాలి.. ఆన్లైన్ అయితే ట్యాక్స్ కట్టాలంట..
ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం స్పెషల్ గా తయారు చేసిన ఓ బైక్ ని వాడాడు. అది ప్రేక్షకులకు ఇస్తాను అని ఓ కాంటెస్ట్ ప్రకటించాడు. దీనికి సంబంధించి కిరణ్ మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసాడు.
కిరణ్ అబ్బవరం రిలీజ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. దిల్ రూబా సినిమాలో నేను ఈ బైక్ వాడాను. ఇది మార్కెట్ లో మీకు ఎక్కడా దొరకదు. దీన్ని మా ఆర్ట్ డైరెక్టర్ స్పెషల్ గా తయారు చేసాడు. ఇది మీరు గెలుచుకోవచ్చు. ఇప్పటివరకు మేము రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ చూసి మా సినిమా కథేంటి అని కరెక్ట్ గా కనిపెడితే వారికి మేమే పిలిచి ఈ బైక్ గిఫ్ట్ గా ఇస్తాము. ఈ బైక్ గెలుచుకున్న వాళ్ళతో మొదటి రోజు మొదటి ఆటకు నేను ఈ బైక్ మీద వస్తాను, వాళ్ళతో కలిసి సినిమా చూస్తాను అని తెలిపారు.
దిల్ రుబా కథని గెస్ చేసిన వాళ్ళు #Dilruba తో ట్విట్టర్ లో ఆ కథ ప్లాట్ పోస్ట్ చేయాలి. కరెక్ట్ గా గెస్ చేసిన వాళ్లకు దిల్ రుబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ బైక్ ని ఇస్తామని వీడియోలో ప్రకటించారు. మరి ఆ బైక్ ఎవరికి వస్తుందో, ఎవరు కరెక్ట్ గా కథ చెప్తారో చూడాలి.
Eee Bike Meede ❤️#Dilruba #DilrubaFromMarch14th pic.twitter.com/v1qpbMrsJU
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 2, 2025