NTR – Neel : అది ఇంటర్నేషనల్ సినిమా.. పిచ్చ కాన్ఫిడెంట్.. ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’ సినిమాపై నిర్మాత కామెంట్స్..
తాజాగా నిర్మాత రవి శంకర్ ఎన్టీఆర్ నీల్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Producer Ravi Shankar Interesting Comments on NTR Prashanth Neel Dragon Movie
NTR – Neel : దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలయింది. ఇటీవలే షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఫోటో కూడా షేర్ చేసి.. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది.
దేవర తర్వాత ఎన్టీఆర్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ కాంబో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు అధికారికంగా టైటిల్ అనౌన్స్ చేయకపోయినా డ్రాగన్ అనే టైటిల్ వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి మైత్రి నిర్మాత రవి శంకర్ మాట్లాడారు. ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఇటీవల రిలీజయి పెద్ద హిట్ అయింది. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాని తెలుగులో మైత్రి నిర్మాతలే రిలీజ్ చేసారు.
Also Read : The Paradise glimpse : అదిరిపోయిన నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్.. ఇది కడుపు మండిన కాకుల కథ.
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా సక్సెస్ మీట్ నేడు తెలుగులో నిర్వహించారు. ఈ ఈవెంట్లో మీడియాతో మాట్లాడగా ఈ సినిమాకు ఆల్రెడీ రిట్టర్న్ ఆఫ్ ది డ్రాగన్ టైటిల్ ఇచ్చారు. మరి ఎన్టీఆర్ నీల్ సినిమాకు తమిళ్ లో ఏం టైటిల్ పెడతారు? అది చెప్పిన టైం కి రిలీజ్ అవుతుందా? ఏ రేంజ్ లో ఉండబోతుంది అని ప్రశ్నలు ఎదురయ్యాయి.
దీనికి నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నీల్ సినిమా ఇండియన్ స్క్రీన్ లో ఇప్పటి వరకు చూడని కథ. ఆ కథకు స్కై లిమిట్. పిచ్చ కాన్ఫిడెంట్ గా ఉన్నాము. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుంది ఆ సినిమా. అది హై వోల్టేజ్ యాక్షన్ తో కూడిన డ్రాగన్. ఈ సినిమా వేరు. దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది వేరే లెవల్ సినిమా. అది ఇంటర్నేషనల్ రిలీజ్ చేసే సినిమా. అది పెద్ద డ్రాగన్ వచ్చి మొత్తం చుట్టేస్తోంది. చెప్పిన టైంకే రిలీజ్ చేస్తాం అని అన్నారు.
Also See : Chhaava : ‘ఛావా’ తెలుగు ట్రైలర్ రిలీజ్.. గూస్ బంప్స్
దీంతో ఎన్టీఆర్ నీల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ ఫిక్స్ అని ఇండైరెక్ట్ గానే చెప్పేసారు. అలాగే ఆ సినిమా గురించి గొప్పగా చెప్పడంతో, ఇంటర్నేషనల్ రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ – నీల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ – నీల్ సినిమా వచ్చే సంవత్సరం 2026 జనవరి 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంటే వచ్చే సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది.