The Paradise glimpse : అదిరిపోయిన నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్.. ఇది కడుపు మండిన కాకుల కథ.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ది ప్యారడైజ్ గ్లింప్స్ వచ్చేసింది.

Nani The Paradise glimpse out now
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన దసరా చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో తాజా చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు.
‘చరిత్రలో అందరూ చిలకలు, పావురాలు గురించి రాసి ఉంటారు గానీ, కానీ అదే జాతిలో కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ.’ అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది.
మొత్తంగా గ్లింప్స్ అదిరిపోయింది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.
Thandel ott release : ఓటీటీలోకి తండేల్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తం ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రానుందట. 1960 బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోందట.