Thandel ott release : ఓటీటీలోకి తండేల్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
తండేల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.

Naga Chaitanya Thandel movie ott streaming date fix
అక్కినేని నాగచైతన్య నటించిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయిక. ఫిబ్రవరి 7న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఏకంగా రూ.100 కోట్లకు పైనే ఈ చిత్రం వసూళ్లను సాధించింది. ఈ క్రమంలో చైతు కెరీర్‌లో మంచి కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది.
మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లి.. పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి శుభవార్త అందింది.
ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనున్నట్లు చెప్పింది.
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.
The #BlockbusterLoveTsunami is hitting your small screens after creating a sensation at the box office ❤️#Thandel streaming on #Netflix from 7th March in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam ❤🔥 pic.twitter.com/HrxrbEb0Ar
— Thandel (@ThandelTheMovie) March 2, 2025