Mad Square : ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా.. ‘మ్యాడ్ స్క్వేర్’.. అమావాస్య వచ్చిందని ఒక రోజు ముందు రిలీజ్..

తాజాగా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ ఒక రోజు ముందుకు మార్చారు. దీనిపై అధికారిక ప్రకటన ఇస్తూ నాగవంశీ ట్వీట్ చేసారు.

Mad Square : ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా.. ‘మ్యాడ్ స్క్వేర్’.. అమావాస్య వచ్చిందని ఒక రోజు ముందు రిలీజ్..

Narne Nithiin Mad Square Movie Release Date Changed Naga Vamsi Tweet goes Viral

Updated On : March 2, 2025 / 12:47 PM IST

Mad Square : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో 2023 లో వచ్చిన మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అయింది. కొత్తవాళ్లతో చిన్న బడ్జెట్ తో తీసిన ఈ సినిమా భారీ హిట్ అవ్వడంతో సీక్వెల్ కూడా ప్రకటించారు. మ్యాడ్ సినిమా సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ ఆల్రెడీ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ గా ఉంది.

ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసి ఫుల్ గా నవ్వించారు. సినిమాలో ఇంతకంటే ఎక్కువ కామెడీ ఉంటుందని చెప్పారు. మ్యాడ్ స్క్వేర్ సినిమాని మొదట మార్చ్ 29 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మార్చ్ 28 అనౌన్స్ చేసారు. ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అయితే మాత్రం మేము ఆగిపోతాము అని నిర్మాత నాగవంశీ ఇటీవల మ్యాడ్ స్క్వేర్ ప్రెస్ మీట్ లో తెలిపారు.

Also Read : Senior Heroins : వామ్మో.. సీనియర్ హీరోయిన్స్ మాస్ డ్యాన్స్ తో రీల్.. మీనా, సంగీత, మహేశ్వరి వైరల్..

తాజాగా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ ఒక రోజు ముందుకు మార్చారు. దీనిపై అధికారిక ప్రకటన ఇస్తూ నాగవంశీ ట్వీట్ చేసారు.

నాగవంశీ తన ట్వీట్ లో.. మా డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ తో, వాళ్ళ రిక్వెస్ట్ తో మ్యాడ్ స్క్వేర్ సినిమా ఒక రోజు ముందే వస్తుంది. మార్చ్ 28నే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మార్చ్ 29 అమావాస్య రావడంతో, మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఒక రోజు ముందే అడగడంతో మేము హ్యాపీగా ఈ సినిమాని ఒక రోజు ముందే రిలీజ్ చేస్తున్నాం. అలాగే మార్చ్ 28న మా మ్యాడ్ స్క్వేర్ సినిమా, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలు రిలీజ్ అయి పెద్ద ఇట్ అయి తెలుగు సినిమాకు మర్చిపోలేని రోజుగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలుపుతూ నితిన్ కి, రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుములకు కూడా విషెష్ తెలిపారు.

Also Read : Star Director Daughter : గోవులతో క్యూట్ గా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? స్టార్ డైరెక్టర్ కూతురు.. హీరో చెల్లి..

దీంతో మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చ్ 28 రిలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. నాగవంశీ ఇంత కాన్ఫిడెంట్ గా మార్చ్ 28 మ్యాడ్ స్క్వేర్ వస్తుందని ట్వీట్ వేయడంతో హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడినట్టే అని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.