Star Director Daughter : గోవులతో క్యూట్ గా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? స్టార్ డైరెక్టర్ కూతురు.. హీరో చెల్లి..
ఈ ఫొటోల్లో ఆవుతో క్యూట్ గా ఉన్న అమ్మాయి ఎవరో అనుకుంటున్నారా?

Star Director Daughter Cute Photos with Cow Photos goes Viral
Find The Star Kid : మన సెలబ్రిటీల పిల్లలు ఫోటోలు షేర్ చేస్తే అవి వైరల్ అవ్వాల్సిందే. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ కూతురు, ఓ హీరో చెల్లి ఫోటోలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఈ ఫొటోల్లో ఆవుతో క్యూట్ గా ఉన్న అమ్మాయి ఎవరో అనుకుంటున్నారా?
ఆవులతో ఉన్న ఈ అమ్మాయి పేరు పవిత్ర. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూతురు. వీళ్ళ అన్న ఆకాష్ పూరి హీరో అని తెలిసిందే. పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి సోషల్ మీడియాలో యాక్టివ్ గాన్ ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల శివరాత్రికి ఓ ఆలయంలో ఇలా ఆవులకు ప్రత్యేక పూజలు చేసింది పవిత్ర. అనంతరం ఆవులతో, దూడలతో క్యూట్ గా ఫోటోలు దిగింది.
ఆవులతో దిగిన ఫోటోలను పవిత్ర తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నంది బలానికి, పవర్ కి, ఎదుగుదలకు ప్రతిరూపం. ఓం నమః పార్వతి పతయే హర హర మహాదేవ అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. పూరి కూతురు ఎంత క్యూట్ గా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు. పవిత్ర ఆల్రెడీ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం పై చదువులు చదువుతున్నట్టు సమాచారం. వాళ్ళ నాన్న, అన్న లాగా సినిమాల్లోకి అయితే రాదు అని తెలుస్తుంది.
ఇక పూరి జగన్నాధ్ లైగర్, డబల్ ఇస్మార్ట్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూసాడు. ప్రస్తుతం పూరి పలువురు హీరోలకు కథలు చెప్పినా ఇంకా ఏ సినిమా ఓకే అవ్వలేదని సమాచారం.
Also See : Manchu Lakshmi : కుంభమేళాలో మంచు లక్ష్మి.. ఫోటోలు వైరల్..